Cheteshwar Pujara: జట్టులో ఒకరే ఫాస్ట్ బౌలర్: టీమిండియా ఆల్ టైమ్ టెస్ట్ జట్టును ప్రకటించిన పుజారా

Cheteshwar Pujara: జట్టులో ఒకరే ఫాస్ట్ బౌలర్: టీమిండియా ఆల్ టైమ్ టెస్ట్ జట్టును ప్రకటించిన పుజారా

టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా తన ఆల్ టైం భారత టెస్ట్ ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు కెప్టెన్ గా ఎవరినీ ప్రకటించలేదు. వివారాల్లోకెళ్తే.. సెహ్వాగ్, గవాస్కర్ లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లను వరుసగా మూడు, నాలుగు స్థానాలకు ఎంపిక చేశారు. లక్ష్మణ్ ను ఆరో స్థానానికి ఎంపిక చేశాడు.మహేంద్ర సింగ్ ధోనీని వికెట్ కీపర్ గా తన జట్టులో స్థానం ఇచ్చాడు. 

దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ను ఏకైక ఆల్ రౌండర్ గా ఎంపిక చేశాడు. లెజెండరీ స్పిన్నర్లు అనీల్ కుంబ్లే, అశ్విన్ లను ఛాన్స్ ఇచ్చాడు. ఏకైక ఫాస్ట్ బౌలర్ గా బుమ్రాను తన ప్లేయింగ్ 11 లో చోటు కల్పించాడు. భారత జట్టును చూసుకున్నటైతే స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ గా బుమ్రాను మాత్రమే సెలక్ట్ చేయడం విశేషం. జహీర్ ఖాన్, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, జడేజా లాంటి స్టార్ క్రికెటర్లకు పుజారా తన జట్టులో చోటు ఇవ్వలేదు. 

►ALSO READ | IPL 2025: జోష్ వస్తున్నాడు.. మార్కో వెళ్తున్నాడు: క్వాలిఫయర్ 1కు పంజాబ్, బెంగళూరు ప్లేయింగ్ 11 ఇవే!

2023 దక్షిణాఫ్రికా టూర్‌ లో భాగంగా టెస్టు జట్టు నుంచి ఈ వెటరన్‌ బ్యాటర్లను సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే.  2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో ఈ వెటరన్ ప్లేయర్ 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. నిలకడగా రాణించలేకపోవడం పుజారాకు మైనస్ గా మారింది.

పుజారా ఆల్ టైమ్ ఇండియన్ టెస్ట్ XI

వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ, జస్ప్రీత్ బుమ్రా, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్