RRB jobs: రైల్వే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 22వేల పోస్టులు.. అర్హతలు ఇవే..

RRB jobs: రైల్వే  రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 22వేల పోస్టులు.. అర్హతలు ఇవే..

ఇండియన్ రైల్వేలో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)  గ్రూప్-డి (లెవల్ 1) పోస్టుల భర్తీకి  ఈరోజు (జనవరి 30) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 వేల పోస్టులని భర్తీ చేయనుంది.

దరఖాస్తుల ప్రారంభం: 31, జనవరి  2026 నుండి 

దరఖాస్తుల చివరి తేదీ:  2 మార్చి  2026.

దరఖాస్తుల విధానం : ఆన్‌లైన్‌లో 

అర్హత: 10వ తరగతి లేదా ITI పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు కూడా అర్హులు. 

వయోపరిమితి: 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్నవారికి వయో సడలింపు ఉంటుంది).

ఎంపిక విధానం: అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష (CBT):  ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఇందులో గణితం, సైన్స్, రీజనింగ్ మరియు జనరల్ అవేర్‌నెస్ నుండి ప్రశ్నలు ఉంటాయి. తెలుగు భాషలో కూడా పరీక్ష రాసుకోవచ్చు. ప్రతి తప్పుకు నెగటివ్ మార్క్ ఉంటుంది.


శారీరక సామర్థ్య పరీక్ష (PET): వెయిట్ లిఫ్టింగ్    టాస్క్, రన్నింగ్  ఉంటాయి.

సర్టిఫికేట్ వెరిఫికేషన్: ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్.

వైద్య పరీక్షలు: రైల్వే ప్రమాణాల ప్రకారం అభ్యర్థుల హెల్త్ చెక్ చేస్తారు.

జీతం : ఎంపికైన అభ్యర్థులకు నెలకు  రూ. 22,500 నుండి రూ. 25,380 వరకు జీతం ఉంటుంది. జీతంతో పాటు ఇతర అలవెన్సులు,  బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేయాలి: అర్హతగల అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు రూ. 250 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.

మరింత సమాచారం కోసం లేదా పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.rrbapply.gov.in/#/auth/landing లో నోటిఫికేషన్ చూడగలరు.