ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను ప్రకటించాలి : బీసీ విద్యార్థి సంఘం

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను ప్రకటించాలి : బీసీ విద్యార్థి సంఘం

ముషీరాబాద్, వెలుగు: బీసీల కోసం 50 ఏండ్లుగా అనేక ఉద్యమాలు చేస్తున్న రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిపురి రవి కుమార్ యాదవ్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యానగర్ లో విద్యార్థి సంఘం సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ఆర్ కృష్ణయ్య ను ఉప రాష్ట్రపతిగా ఎన్నుకుంటే బీసీలకు సముచిత స్థానం కల్పించడంతోపాటు తెలంగాణకు తగిన గుర్తింపు వస్తుందన్నారు. గతంలో ఏపీ నుంచి ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారని, ఈసారి తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే అనేక ఉద్యమాలు చేసిన ఆర్ కృష్ణయ్య కు పద్మశ్రీ అవార్డు కూడా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.