ఇంటర్ అడ్మిషన్లు ఆన్ లైన్ లో పెట్టరెందుకు ? : వేముల రామకృష్ణ

ఇంటర్ అడ్మిషన్లు ఆన్ లైన్ లో పెట్టరెందుకు ? : వేముల రామకృష్ణ

ముషీరాబాద్,వెలుగు: గురుకుల, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు తీసుకుంటున్నప్పుడు ఇంటర్ అడ్మిషన్లు ఎందుకు చేపట్టడం లేదని బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ బోర్డు అధికారులను ప్రశ్నించారు. దీని వెనుక ఆంతర్యం ఏమిటో తెలపాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం విద్యానగర్ లోని విద్యార్థి సేన రాష్ట్ర ఆఫీసులో చంద్రశేఖర్ గౌడ్ అధ్యక్షతన విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది.  

రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను కాపాడుతూ వాటిలో చదివిన విద్యార్థులకే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో భాస్కర్, చంద్రకాంత్, అనిల్, ప్రవీణ్, ఉదయ్, వినోద్, భాస్కర్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.