జనాభా దామాషాలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి...జనగణనలో కులగణన చేపట్టాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్

జనాభా దామాషాలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి...జనగణనలో కులగణన  చేపట్టాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగబద్ధంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీల వాటా బీసీలకే దక్కాలంటే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని కోరారు. శుక్రవారం ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీసీ డిమాండ్లపై మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు పెంచాలని దశాబ్దాలుగా పోరాడుతున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. 

బీసీ రిజర్వేషన్లు పెంచకపోవడం వల్ల బీసీలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే జోక్యం చేసుకొని, జనగణనలో బీసీ కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కులగణన చేపట్టాక బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్ల హామీని నెరవేర్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తామంటే బీసీ సమాజం ఒప్పుకోదన్నారు.