
ఖైరతాబాద్, వెలుగు : హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కేబీఅర్ కన్వేన్షన్లో వచ్చే నెల 15న బీసీల రాజకీయ ప్లీనరీని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. బీసీలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా ఈ సభ చేపట్టనున్నట్లు తెలిపారు.
ALSOREAD:విత్తనాల కోసం పక్క రాష్ట్రాలకు రైతులు.. కర్నాటక నుంచి కందులు, సోయా
సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ తో కలసి మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు, డిక్లరేషన్ల పేరుతో బీసీలకు రాజకీయ ఉనికి లేకుండా చేస్తున్నారని.. జనాభా ఆధారంగా టికెట్లు ఇవ్వకుండా ప్రధాన పార్టీలు మోసం చేస్తున్నాయని జాజుల ఆరోపించారు.