బీసీలకు ఐదు మంత్రి పదవులివ్వాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలకు ఐదు మంత్రి పదవులివ్వాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • బీసీలను పట్టించుకోకపోవడం వల్లే కేసీఆర్ ఓడిపోయారు

ఖైరతాబాద్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం 60 శాతం ఉన్న బీసీలకు 5 మంత్రి పదవులు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.  బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్​క్లబ్​​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని పదవుల్లో బీసీలకు  సముచిత స్థానం కల్పించాలని సీఎం రేవంత్​రెడ్డిని కోరారు.  ప్రగతి భవన్ ​ముందు ఇనుప గ్రిల్స్​ తొలగింపు, భవన్​కు మహాత్మా జ్యోతి రావు ఫూలే పేరు పెట్టడం అభినందనీయమన్నారు.

 అదే విధంగా సిటీలో 5 ఎకరాల భూమి కేటాయించి పూలే స్మృతి వనం  నిర్మించి, ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.  తమ సమస్యలను  వివరించేందుకు మాజీ సీఎం కేసీఆర్​ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదన్నారు.​ కేసీఆర్​ బీసీలను విస్మరించినందునే అధికారం కోల్పోయారన్నారు.  సమావేశంలో గొల్ల కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్న శ్రీశైలం యాదవ్,  బీసీ సంఘాల నేతలు గణేశ్​చారి, దుర్గయ్య గౌడ్​, విక్రంగౌడ్​ తదితరులు పాల్గొన్నారు.​