హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల బదిలీల్లో బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులు రూల్స్ ఉల్లంఘిస్తున్నారు. క్లియర్ వెకెన్సీ లిస్ట్ గానీ, ట్రాన్స్‌ఫర్స్ సీనియారిటీ లిస్ట్ గానీ విడుదల చేయకపోవడంతో ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో అధికారులు ఆప్షన్ ఫారమ్స్ ఫిల్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
సరైన సమాచారం లేకుండా ఆప్షన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడం వల్ల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఆందోళనకు గురవుతున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తున్న ఉన్నతాధికారులపై బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు త్వరలో ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగులు రెడీ అవుతున్నారు. వెంటనే క్లియర్ వెకెన్సీ లిస్ట్, ట్రాన్స్‌ఫర్స్ సీనియారిటీ లిస్ట్ విడుదల చేసి, ఉద్యోగులకు పూర్తి సమాచారం అందించిన తర్వాత ఆప్షన్స్ పెట్టుకునేందుకు మరికొన్ని రోజులు అదనపు సమయం ఇవ్వాలని బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులను ఉద్యోగులు కోరుతున్నారు.
