IPL 2024: అదే చివరి ఐపీఎల్ మ్యాచ్: ముస్తాఫిజుర్ కోసం బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్

IPL 2024: అదే చివరి ఐపీఎల్ మ్యాచ్: ముస్తాఫిజుర్ కోసం బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు బ్యాడ్ న్యూస్. బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ కు దూరం కానున్నాడు. మే 1 తర్వాత ఈ లెఫ్టర్మ్ పేసర్ అందుబాటులో ఉండడు. బంగ్లాదేశ్ మే 3 నుండి స్వదేశంలో జింబాబ్వేపై ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. దీని ప్రకారం ఏప్రిల్ 30 న ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్ చేరుకోవాల్సి ఉంటుంది. అయితే మే 1న పంజాబ్ కింగ్స్‌తో సిఎస్‌కె మ్యాచ్ ఉండటంతో బీసీసీఐ అభ్యర్థనల మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక రోజు గడువును పొడిగించింది.

ముస్తాఫిజుర్ రానున్న నాలుగు మ్యాచ్ లు ఆడనున్నాడు. ఏప్రిల్ 19, 23న లక్నో సూపర్ జెయింట్‌తో, ఏప్రిల్ 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, మే 1న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు. జింబాబ్వే సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ USAతో మూడు T20Iలను ఆడాల్సి ఉంది. దీంతో మే 1 తర్వాత జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లకు ఈ బంగ్లా పేసర్ దూరం కానున్నాడు. 

"ముస్తాఫిజుర్‌కు ఏప్రిల్ 30 వరకు ఐపీఎల్‌లో ఆడేందుకు సెలవు ఇచ్చాం. కానీ మే 1న చెన్నై మ్యాచ్ ఉన్నందున.. చెన్నై, బీసీసీఐ నుండి అభ్యర్థన మేరకు మేము అతని సెలవును ఒక రోజు పొడిగించాము." అని BCB డిప్యూటీ షహరియార్ నఫీస్ చెప్పారు. ప్రస్తుతం ఐపీఎల్ లో ముస్తాఫిజుర్ బాగా రాణిస్తున్నాడు. తనదైన మార్క్ తో చెన్నై జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్ లాడిన ఈ బంగ్లా పేసర్ 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.