న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం (జనవరి 3) ఎంపిక చేసింది. "జనవరి 11నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. శ్రేయాస్ అయ్యర్ లభ్యత ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుంది. పని భారం కారణంగా హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇస్తున్నారు". అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు శుభ్‌మాన్ గిల్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు గిల్ దూరమైన గిల్.. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు జట్టులో స్థానం దక్కింది. సూపర్ ఫామ్ లో ఉన్న వీరిద్దరి ఆట చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకున్న అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. గత ఏడాది ఆస్ట్రేలియా సిరీస్ లో గాయపడిన అయ్యర్ 90 శాతం ఫిట్ నెస్ సాధించాడు. సిరీస్ సమయానికల్లా పూర్తి ఫిట్ నెస్ సాధిస్తాడనే ఆశాభావంతో జట్టు యాజమాన్యం ఉంది.
సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో సెంచరీతో సత్తా చాటిన గైక్వాడ్ కు 15 మంది స్క్వాడ్ లో చోటు దక్కలేదు. శ్రేయాస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి మరోసారి నిరాశే మిగిలింది. డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నా మరోసారి షమీకి సెలక్టర్లు మొండి చెయ్యి చూపించారు. హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వన్డే జట్టులో ఛాన్స్ సంపాదించాడు. బ్యాకప్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కు అవకాశం దక్కింది.
న్యూజిలాండ్ తో సిరీస్ కు భారత వన్డే జట్టు :
శుభమాన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్
🚨 News 🚨
— BCCI (@BCCI) January 3, 2026
India’s squad for @IDFCFIRSTBank ODI series against New Zealand announced.
Details ▶️ https://t.co/Qpn22XBAPq#TeamIndia | #INDvNZ pic.twitter.com/8Qp2WXPS5P
