సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు కెప్టెన్ ధావన్

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు కెప్టెన్ ధావన్

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఆడబోయే టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. ఈ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్ నాయకత్వం వహించనున్నాడు. శ్రేయర్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్ అవకాశం దక్కించుకున్నారు. ఆర్సీబీ బ్యాట్స్ మన్ రజత్ పాటీదార్ ..తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. 

ముకేష్ కుమార్కు పిలుపు
మిడిలార్డర్ బ్యా్ట్స్ మన్ గా రాహుల్ త్రిపాఠి సెలక్ట్ అయ్యాడు. వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌‌కు అవకాశం దక్కింది. ఆల్ రౌండర్ కోటాలో షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్ లకు బీసీసీఐ చోటిచ్చింది. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్‌లు ఎంపికయ్యారు. దేశవాళీలో సత్తా చాటిన ముకేశ్ కుమార్‌ తొలిసారి పిలుపు అందింది. టీ20 వరల్డ్ కప్ టీమ్ స్టాండ్‌బైలో  సిరాజ్, దీపక్ చాహర్‌లు ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆసియాకప్‌లో  విఫలమైన ఆవేశ్ ఖాన్పై బీసీసీఐ నమ్మకముంచింది.  

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఫస్ట్ మ్యాచ్  లక్నో లో అక్టోబర్ 6న  జరగనుంది. రెండో మ్యాచ్ రాంచీ వేదికగా అక్టోబర్ 9న నిర్వహిస్తారు. చివరి మ్యాచ్ ఢిల్లీలో  అక్టోబర్ 11న జరుగుతుంది. 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా: ధావన్(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, సిరాజ్, దీపక్ చాహర్