BCCI: డొమెస్టిక్ క్రికెటర్లకు పండగే.. ఏకంగా 1,788 మ్యాచ్‌లతో BCCI కొత్త షెడ్యూల్!

BCCI: డొమెస్టిక్ క్రికెటర్లకు పండగే.. ఏకంగా 1,788 మ్యాచ్‌లతో BCCI కొత్త షెడ్యూల్!

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సరికొత్త దేశవాళీ సీజన్ 2026-27 షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సీజన్‌లో పురుషులు, మహిళల క్రికెట్‌లో వివిధ వయస్సుల వారు ఆడేలా, ఫార్మాట్లలో కలిపి మొత్తం 1,788 మ్యాచ్‌లు జరగనున్నాయి. సీనియర్, U23, U19, U16 కేటగిరీలలో అత్యంత సుదీర్ఘమైన ఈ క్యాలెండర్ ద్వారా దేశవాళీ క్రికెట్ ప్రమాణాలను మరింత పెంచేలా బీసీసీఐ ఈ షెడ్యూల్‌ను ప్రతిష్టాత్మకంగా రూపొందించింది.

ఆగస్టు 23 నుంచే దేశవాళీ సీజన్ స్టార్ట్: 
భారత అత్యంత ప్రతిష్టాత్మకమైన రెడ్-బాల్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ (Duleep Trophy)తో ఆగస్టు 23, 2026 నుంచి ఈ కొత్త డొమెస్టిక్ సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 6 జోనల్ జట్లు తలపడనున్నాయి. దీని తర్వాత అక్టోబర్ 1 నుంచి ప్రఖ్యాత ఇరానీ కప్ (Irani Cup) మ్యాచ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత రంజీ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్నందున ఈ మ్యాచ్ జమ్మూ లేదా శ్రీనగర్‌లో జరిగే అవకాశం ఉంది.

రెండు విడతలుగా రంజీ ట్రోఫీ: 
ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి, రికవరీ సమయాన్ని ఇస్తూనే.. మల్టీ-డే (రెడ్-బాల్) క్రికెట్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చేలా రంజీ ట్రోఫీ, కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలను ఈసారి కూడా రెండు విడతల ఫార్మాట్లోనే నిర్వహించనున్నారు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌లో 4 గ్రూపులుగా విభజించిన 32 జట్లు పోటీ పడనుండగా.. ప్లేట్ గ్రూప్‌లో 6 జట్లు తలపడతాయి. అలాగే, ఎమర్జింగ్ U23 క్రికెటర్లకు మరింత పోటీతత్వాన్ని అందించేందుకు గాను, దాదాపు చాలా కాలం తర్వాత కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ విజేత వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest of India) మ్యాచ్‌ను తిరిగి పునరుద్ధరించారు. ఈ మ్యాచ్ అక్టోబర్ 1 నుంచి 4 వరకు జరగనుంది.

►ALSO READ | భారత టీ20 కెప్టెన్ అయ్యే అర్హత అతడికే ఉంది.. అయ్యర్‌కు ఆసీస్ లెజెండ్ ఫుల్ సపోర్ట్!

వన్డేల నుంచి టీ20లుగా మారిన టోర్నీలు: 
ఆధునిక  క్రికెట్ అభిమానుల డిమాండ్స్‌కు అనుగుణంగా దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు బీసీసీఐ కొన్ని కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా పురుషుల U23 స్టేట్ 'ఎ' ట్రోఫీ, విజ్జీ ట్రోఫీలను వన్డే ఫార్మాట్ నుంచి టీ20 టోర్నమెంట్లుగా మార్చారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యువ ఆటగాళ్లలో వేగాన్ని, దూకుడును పెంచేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

వేదికలు, షెడ్యూల్‌లో కీలక మార్పులు: 
* కూచ్ బెహార్ ట్రోఫీ (Cooch Behar Trophy): ఈ ఎలైట్ గ్రూప్ నాకౌట్ మ్యాచ్‌లను బెంగళూరు, మైసూర్ వేదికల్లో నిర్వహించనున్నారు. జనవరి నెలలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉండే వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ అన్ని జట్లకు సమానమైన అవకాశాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

* విజయ్ మర్చంట్ ట్రోఫీ (Vijay Merchant Trophy - U16): ఈ అండర్-16 టోర్నమెంట్‌ను షెడ్యూల్ కంటే కాస్త ముందుకు జరిపారు. ఇప్పుడు ఈ టోర్నీ నవంబర్ నుంచి జనవరి వరకు జరగనుంది. దీనివల్ల అండర్ 16 క్రికెటర్ల సన్నద్ధతకు, మెరుగైన షెడ్యూలింగ్‌కు ఛాన్స్ లభిస్తుంది.

* సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT): ఈ టీ20 టోర్నీ ఎలైట్ లీగ్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు విశాఖపట్నం, ముంబై, కోల్‌కతా, మొహాలీలలో జరగనుండగా, నాకౌట్ మ్యాచ్‌లు అక్టోబర్ 14 నుంచి 25వ తేదీ వరకు నాగ్‌పూర్‌లో జరగనున్నాయి.

https://bcciplayerimages-v2.s3.ap-south-1.amazonaws.com/bcci/documents/1779273276961_BCCI%202026-27%20Domestic%20Season%20Ready%20Reckoner.pdf https://bcciplayerimages-v2.s3.ap-south-1.amazonaws.com/bcci/documents/1779273283754_Venues%20for%20BCCI%20Domestic%20Season.pdf