BCCI Elections: బీసీసీఐకి కొత్త ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌కు నయా చైర్మన్‌‌‌‌‌‌‌‌!

BCCI Elections: బీసీసీఐకి కొత్త ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌కు నయా చైర్మన్‌‌‌‌‌‌‌‌!

న్యూఢిల్లీ: బీసీసీఐలో తొందర్లోనే కీలక పోస్టులు మారనున్నాయి. ఈ నెలాఖరులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) లో ప్రెసిడెంట్, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్ పోస్టులకు కొత్తవారిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుత ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఆరేండ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నందున రూల్స్ ప్రకారం మూడేండ్ల పాటు పదవులకు (కూలింగ్ ఆఫ్) దూరంగా ఉండాలి. 

దీంతో, కొత్త చైర్మన్‌‌‌‌‌‌‌‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పోస్టుకు  ముంబై క్రికెట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ సంజయ్ నాయక్,  బీసీసీఐ వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ శుక్లా మరోసారి ఐపీఎల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికైతే, బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ రాకేష్ తివారీ బోర్డు వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసే అవకాశం ఉంది. 

బీసీసీఐ ప్రస్తుత ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ జులైలో 70 ఏండ్లు పూర్తి చేసుకున్నందున, బోర్డు నిబంధనల ప్రకారం తిరిగి ఆ పోస్టుకు పోటీ చేయడానికి అనర్హుడు. దీంతో కొత్త అధ్యక్షుడి కోసం వేట మొదలైంది.  ఈ పోస్టును ఓ లెజెండరీ క్రికెటర్ చేపట్టాలని బోర్డులోని కీలక వ్యక్తులు భావిస్తున్నారు. బిన్నీతో పాటు గతంలో సౌరవ్ గంగూలీ ఈ పదవిలో ఉన్నాడు. అయితే, గౌరవప్రదమైన పదవిని చేపట్టడానికి ఎంతమంది మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, రాబోయే  ఎన్నికలు బీసీసీఐ సొంత నిబంధనల ప్రకారం జరగనున్నాయి. 

2020 నుంచి వైస్ ప్రెసిడెంట్ పోస్టులో ఉన్న రాజీవ్ శుక్లా బోర్డులో మరో ఏడాదిపాటు ఆఫీస్ బేరర్ పోస్టు చేపట్టవచ్చు.  ఒకవేళ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ అమల్లోకి వస్తే  శుక్లా కూలింగ్-ఆఫ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదని బోర్డులోని ఒక వర్గం చెబుతోంది.