మరోసారి బీసీసీఐకి కాసుల వర్షం

మరోసారి బీసీసీఐకి కాసుల వర్షం
  • టెండర్లను ఆహ్వానించిన బీసీసీఐ

ముంబై: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌.. మరోసారి బీసీసీఐకి కాసుల వర్షం కురిపించబోతున్నది. వచ్చే  ఐదు సీజన్ల (2023–2027) మీడియా రైట్స్‌‌‌‌‌‌‌‌ కోసం బోర్డు మంగళవారం టెండర్లను ఆహ్వానించింది. తొలిసారి ఈ–ఆక్షన్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైట్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా దాదాపు రూ. 50 వేల కోట్లు రాబట్టాలని బోర్డు టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది.  బిడ్డర్లు మే 10వ తేదీలోపు రూ. 25 లక్షలు చెల్లించి టెండర్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్స్​ కొనుగోలు చేయొచ్చని బోర్డు చెప్పింది.