క్రికెటర్లకు బీసీసీఐ పూర్తి జీతం

క్రికెటర్లకు బీసీసీఐ పూర్తి జీతం

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ క్రికెటర్లకు సంబంధించిన క్వార్టర్లీ పేమెంట్స్‌ను బీసీసీఐ క్లియర్‌ చేసింది. ఈ కష్టకాలంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మొత్తాన్ని వెంటనే విడుదల చేసింది. కరోనా కారణంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా బోర్డులు తమ ఆటగాళ్ల జీతాలలో కోత విధిస్తున్నాయి. కానీ బీసీసీఐ ఎలాంటి కోత లేకుండానే ప్లేయర్లకు జీతాలు చెల్లించింది. ‘మార్చి 24న లాక్‌‌‌‌డౌన్‌ ప్రకటించినప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించాం. అందుకే ఎలాంటి దానికైనా సిద్ధంగా ఉండాలని ముందుగానే ప్లాన్స్‌ వేసుకున్నాం. అందులో భాగంగానే ప్లేయర్లకు జీతాలు చెల్లించేశాం. ఈ మూడు నెలల కాలంలో ఇండియా, ఏ జట్లకు ఆడిన ప్రతి ఒక్కరికి మ్యాచ్‌ ఫీజులు కూడా చెల్లించాం’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.