
న్యూఢిల్లీ: ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మే 23 నుంచి 28 వరకు ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం మే 23, 24వ తేదీల్లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో మే 26న క్వాలిఫయర్2 జరగనుంది. అదే స్టేడియానికి ఫైనల్ కేటాయించారు. మే 28న మెగా ఫైనల్ జరగనుంది. కాగా, లెజెండరీ క్రికెటర్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీని దృష్టిలో ఉంచుకొని బోర్డు వ్యూహాత్మకంగా చెన్నైకి రెండు ప్లేఆఫ్స్ కేటాయించినట్టు అర్థం చేసుకోవచ్చు. 41 ఏండ్ల మహీకి ఇదే చివరి ఐపీఎల్ అన్న అభిప్రాయాలున్నాయి. తన ఫేర్‌వెల్ మ్యాచ్ చెన్నైలోనే ఉంటుందని మహీ గతంలో చెప్పాడు. లీగ్ ఫేజ్‌లో సీఎస్కే తన చివరి పోరును ఢిల్లీలో ఆడనుంది. ఆ టీమ్ ప్లే ఆఫ్స్ చేరితే ధోనీ మే 23 లేదా 24న మెగా లీగ్‌లో తన ఆఖరి మ్యాచ్‌ను చెపాక్‌లో ఆడే చాన్సుంది.