వాడీవేడిగా ఏసీసీ మీటింగ్.. ట్రోఫీ ఎత్తుకెళ్లటంపై ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్

వాడీవేడిగా ఏసీసీ మీటింగ్.. ట్రోఫీ ఎత్తుకెళ్లటంపై ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్

ఆసియా కప్ గెలిచిన టీం ఇండియాకు రావాల్సిన ట్రోపీని తీసుకెళ్లిన పాక్.. ఇప్పటికీ ఇండియా కు తిరిగి ఇవ్వలేదు. కప్ ఇవ్వాల్సిందేనని బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసినా.. పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో మంగళవారం (సెప్టెంబర్ 30) జరిగిన ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) మీటింగ్ వాడీవేడిగా జరిగింది.

ఏసీసీ మీటింగ్ కు ఇండియా నుంచి బీసీసీఐ వైస్ ప్రసిడెంట్ రాజీవ్ శుక్లా, మాజీ ట్రెజరర్ ఆశిష్ శేలర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా గెలిచిన ట్రోఫీని పాక్ తీసుకుపోవడంపై మీటింగ్ లో బీసీసీఐ అభ్యంతరం తెలిపింది. ఆసీసీ ఛైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ ముందు గట్టిగా డిమాండ్ చే ట్రోఫీ విషయంలో ఇండియా ప్రతినిధులు గట్టిగా పట్టుబట్టారు. 

అయితే నఖ్వీ మాత్రం ట్రోఫీ ఇచ్చేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఏసీసీ మీటింగ్ సందర్భంగా స్పీచ్ లో కూడా ట్రోఫీ గురించి నఖ్వీ మాట్లాడక పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

అంతే కాకుండా.. ఏసీసీ మీటింగ్ లో ఆసియా కప్ గురించి మాట్లాడిన ఏసీసీ ఛైర్మన్.. ఇండియాకు కనీసం కంగ్రాచులేషన్స్ కూడా చెప్పకపోవడంపై ఆశిష్ శేలర్ కలుగ జేసుకవడంతో స్పందించినట్లు చెప్పారు. అప్పుడు అభినందనలు చెప్పారని శేలర్ అన్నారు. 

పాక్ క్రికెట్ బోర్డుకు, ఏసీసీకి ట్రోఫీని భారత్ కు ఇచ్చే ఉద్దేశం లేనట్లు కనిపించిందని బీసీసీఐ అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఐసీసీ (ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్) కు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. 

ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో ఇండియా గెలిచినప్పటికీ.. పాక్ మంత్రి, ఏసీసీ చీఫ్ చేతుల నుంచి ట్రోఫీ తీసుకోవడం ఇష్టం లేక వదిలేసి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ఛాన్స్ అని కప్ ను తీసుకెళ్లిన నఖ్వీ.. నిబంధనల ప్రకారం ఇండియా కు అప్పగించాల్సి ఉంది. లేదంటే ఐసీసీకి చేర్చాలి. కానీ ఇండియాకు ఇవ్వకపోవడంపై వివాదం నడుస్తూనే ఉంది. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది.