ఆసీస్ టూర్‌‌కు రోహిత్ ఎంపిక.. ఒక్క టెస్టుకే కోహ్లీ పరిమితం

ఆసీస్ టూర్‌‌కు రోహిత్ ఎంపిక.. ఒక్క టెస్టుకే కోహ్లీ పరిమితం

ముంబై: ఆస్ట్రేలియా టూర్‌‌కు టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ కాంట్రవర్సీకి బీసీసీఐ ఫుల్‌స్టాప్ పెట్టింది. ఆసీస్ టూర్‌‌కు వెళ్లే టీమిండియా జట్టులో రోహిత్ పేరును చేర్చింది. అయితే కేవలం టెస్టు సిరీస్ టీమ్‌‌లో మాత్రమే హిట్‌‌మ్యాన్‌‌ను చేర్చింది. ఆదివారం జరిగిన మీటింగ్‌‌లో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒక్క టెస్టుకే పరిమితం చేసింది. కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రెగ్నెన్సీతో ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు డెలివరీ టైమ్‌‌‌‌కు కోహ్లీ తిరిగి ఇండియాకు రానున్నందున.. కోహ్లీని సింగిల్ టెస్టు మ్యాచుకే పరిమితం చేసింది. టీ20 సిరీస్‌‌లో ఆడనున్న జట్టులో కూడా బోర్డు ఒక మార్పు చేసింది. ఇప్పటికే ఎంపిక చేసిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేస్‌‌లో.. ఐపీఎల్‌‌లో సన్‌‌రైజర్స్ హైదరాబాద్ తరఫున దుమ్మురేపిన పేసర్ టి.నటరాజన్‌‌కు చోటు కల్పించింది. భుజం గాయంతో వరుణ్ చక్రవర్తి బాధపడుతున్నాడు.