V6 News

టీ20 వరల్డ్​కప్​, ఐపీఎల్ పైనే ఫోకస్

టీ20 వరల్డ్​కప్​, ఐపీఎల్ పైనే ఫోకస్
  • టీ20 వరల్డ్​కప్​, ఐపీఎల్​పై ఫోకస్​
  • నేడు బీసీసీఐ ఎస్​జీఎమ్​
  • డొమెస్టిక్​ ప్లేయర్ల పేమెంట్స్‌‌పైనా చర్చ

వాయిదా పడిన ఐపీఎల్​ 14​ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి..? సందిగ్దంలో ఉన్న టీ20 వరల్డ్​కప్​ను ఎలా నిర్వహించాలి..?  బైలేటరల్​ సిరీస్​ల విషయంలో ఏం చేయాలి..?  డొమెస్టిక్​ టోర్నీలను ఎలా గాడిలో పెట్టాలి.. దేశవాళీ  ప్లేయర్లకు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలి..? ఇలా ఒక్కో అంశంపై నేడు జరిగే స్పెషల్​ జనరల్​ బాడీ మీటింగ్​లో బీసీసీఐ సవివరంగా చర్చించనుంది..! టీ20 వరల్డ్​కప్​పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తితో పాటు.. ఐపీఎల్​కు ఫారిన్​ ప్లేయర్లను ఎలా రప్పిస్తారన్న సందేహాలకు కూడా ఈ మీటింగ్​లో జవాబు దొరికే చాన్స్​ ఉంది!!

న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్లుగానే.. ఐపీఎల్​ సెకండ్​ ఫేజ్​ మ్యాచ్​ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్​ను ఫిక్స్​ చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా శనివారం జరిగే స్పెషల్​ జనరల్​ బాడీ మీటింగ్​ (ఎస్​జీఎమ్​)లో దీనిపై ఫైనల్ నిర్ణయం తీసుకునే చాన్స్​ ఉంది. అరబ్​ గడ్డపై మూడు వారాల విండోలో లీగ్​ను కంప్లీట్​ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇండియాలో కరోనా కేసుల  నేపథ్యంలో.. రాబోయే సీజన్​ ఎలా ఉండాలన్న ప్రధాన ఎజెండాతో ఈ మీటింగ్​ జరగనుంది. ఇక అన్నింటికంటే ఆసక్తి రేపుతున్న ఐసీసీ టీ20 వరల్డ్​కప్​ హోస్టింగ్​పై ప్రధాన చర్చ జరగనుంది. ఎందుకంటే  దేశంలో ప్రస్తుత పరిస్థితి బాగాలేకపోవడంతో.. మెగా ఈవెంట్​ను యూఏఈకి తరలించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జూన్​ 1న ఐసీసీ సమావేశం కానుంది. దీంతో ఇంటర్నేషనల్​ బాడీ భిన్నమైన నిర్ణయం తీసుకుంటే.. ఏం చేయాలన్న దానిపై బీసీసీఐ సమాలోచనలు చేయనుంది. లాస్ట్​ ఇయర్​ రంజీ ట్రోఫీ సీజన్​ క్యాన్సిల్​ కావడంతో డొమెస్టిక్​ ప్లేయర్లకు పరిహారం ఎలా ఇవ్వాలన్న దానిపై కూడా చర్చించనున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్​ సౌరవ్​ గంగూలీ.. ముంబై నుంచి ఈ మీటింగ్​ను వర్చువల్​గా కండక్ట్​ చేయనున్నాడు. ‘ప్రస్తుతం మాకున్న ప్రధాన ఎంజెండా ఐపీఎల్​ షెడ్యూల్​. మేం 10 డబుల్​ హెడర్స్​, 7 సింగిల్​ మ్యాచ్​లు, 4  ప్లే ఆఫ్​  మ్యాచ్​లని అనుకుంటున్నాం. లీగ్​ రీస్టార్ట్​, ఎండింగ్​.. వీకెండ్స్​లో ఉండేలా ప్లాన్​ చేస్తున్నాం. దీనికి బోర్డు సభ్యులు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది’ అని బీసీసీఐ సీనియర్​ అధికారి ఒకరు పేర్కొన్నాడు. 

ఫారిన్​ ప్లేయర్ల గురించి ఆలోచిస్తున్నాం..

సెప్టెంబర్​, అక్టోబర్​ విండోలో చాలా కంట్రీస్​ ఇంటర్నేషనల్​ సిరీస్​లో బిజీగా ఉండనున్నాయి. దీంతో ఫారిన్​ ప్లేయర్లను ఎలా రప్పించాలన్న దానిపై చర్చ జరగనుంది. లాజిస్టిక్​ అంశాలతో పాటు బబుల్​ టు బబుల్​ ట్రాన్స్​ఫర్​ గురించి కూడా మాట్లాడొచ్చు. ఐపీఎల్​ కంటే నేషనల్​ డ్యూటీయే తమకు ముఖ్యమని ఈసీబీ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో దాదా, సెక్రటరీ జైషా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. బట్లర్​, స్టోక్స్​, ఆర్చర్​, బెయిర్​స్టో, సామ్​ కరన్​, మోర్గాన్​, మొయిన్​ అలీ.. తమ ఫ్రాంచైజీల్లో ప్రధాన ప్లేయర్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లను రీప్లేస్​ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి కచ్చితంగా ఈసీబీని ఏదో రకంగా ఒప్పించాలని బీసీసీఐ భావిస్తోంది. సెప్టెంబర్​ 14న ఇంగ్లండ్​తో లాస్ట్​ టెస్ట్​ ముగిసిన తర్వాత ఇరుజట్ల ప్లేయర్లను డైరెక్ట్​గా చార్టెడ్​ ఫ్లైట్​లో దుబాయ్​ తీసుకురావాలని బోర్డు ప్లాన్​ చేస్తోంది. అయితే ఇందుకు ఈసీబీ ఒప్పుకుంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

కివీస్​, సౌతాఫ్రికాతో సిరీస్​లు రద్దు?

టీ20 వరల్డ్​కప్​కు ముందు ఇండియా.. న్యూజిలాండ్​, సౌతాఫ్రికాతో ఆరు వైట్​బాల్​ మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. కానీ ఐపీఎల్​ సెకండ్​ ఫేజ్​.. సెప్టెంబర్​ 15, అక్టోబర్​ 15 మధ్య షెడ్యూల్​ చేశారు. కాబట్టి ఐపీఎల్​ ఆడాలంటే.. ఈ రెండు సిరీస్​లను క్యాన్సిల్​ చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇక మెగా లీగ్​ ముగిసిన తర్వాత నవంబర్​లో కివీస్​.. ఇండియాతో రెండు టెస్ట్​ల సిరీస్​ ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సిరీస్​ను ఎలా షెడ్యూల్ చేయాలనేదానిపై ఎస్​జీఎంలో చర్చించే అవకాశం ఉంది. 
రంజీ ట్రోఫీ పరిహారం..
లాస్ట్​  సీజన్​లో రంజీ ట్రోఫీ క్యాన్సిల్ కావడంతో దాదాపు 700 మంది సీనియర్​ డొమెస్టిక్​ క్రికెటర్స్​ (మెన్స్​) చాలా ఇబ్బందులపాలయ్యారు. అయితే వీళ్లందరికి పరిహారం అందజేస్తామని బీసీసీఐ జనవరిలోనే హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు వాళ్లకు ఎలాంటి ప్యాకేజ్​ అందలేదు. దీనిని ఎలా వర్కౌట్​ చేయాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ‘కేవలం 73 మంది అన్​క్యాప్​డ్​ ప్లేయర్లకు మాత్రమే ఐపీఎల్​ కాంట్రాక్ట్స్​ ఉన్నాయి. విజయ్​ హజారే, సయ్యద్​ ముస్తాక్​ అలీలో ఆడటం వల్ల ఒక్కో మ్యాచ్​కు రూ. 35 వేలు అందుతాయి. కానీ లాస్ట్​ ఇయర్​ మ్యాచ్​లు లేకపోవడంతో ప్లేయర్లు చాలా ఆదాయం కోల్పోయారు. కనీసం కొంతైనా వాళ్లకు ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. అయితే ఒక్కో స్టేట్​కు ఏక మొత్తంలో ప్యాకేజ్​ ఇవ్వడమే సరైన పరిష్కార మార్గమనుకుంటున్నాం. దీంతో గత సీజన్​లోని రోస్టర్​ ప్రకారం ప్లేయర్లకు ఈ డబ్బులను ఆయా స్టేట్స్​ డిస్ట్రిబ్యూట్​ చేస్తాయి’ అని సీనియర్​ అధికారి వ్యాఖ్యానించాడు.

వరల్డ్​కప్​పై నిర్ణయం ఎలా?

అక్టోబర్​లో టీ20 వరల్డ్​కప్​ నిర్వహణపై డౌట్స్​ మొదలైన నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు హోస్టింగ్​ రైట్స్​ను ఇండియా వదులుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే టైమ్​లో ఇండియాలో కరోనా థర్డ్​ వేవ్​ మొదలయ్యే చాన్స్​ ఉందని మెడికల్​ ఎక్స్​పర్ట్స్​ అంచనా వేస్తున్నారు. దీంతో మెగా ఈవెంట్​ను ఏం చేయాలన్న దానిపై అటు బీసీసీఐ, ఇటు ఐసీసీ కసరత్తులు చేస్తోంది. ఒకవేళ యూఏఈలో ఫుల్​ ఐపీఎల్​ జరిగి ఉంటే పిచ్​లు దెబ్బతినే చాన్స్​ ఉండేది. కానీ ఇప్పుడు సగం మ్యాచ్​లే జరుగుతున్నాయి కాబట్టి.. మూడింటిలో రెండు గ్రౌండ్స్​ను టీ20 వరల్డ్​కప్​ కోసం పక్కనబెట్టాలని ఎమిరైట్స్​ క్రికెట్​ బోర్డుతో పాటు బీసీసీఐని కూడా ఐసీసీ అడిగే చాన్స్​ ఉంది. దీంతో ఒక గ్రౌండ్​లోనే ఐపీఎల్​ను కంప్లీట్​ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.