న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని బీసీసీఐ ఏడాది పాటు పొడిగించాలని డిసైడింది. 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో వచ్చే ఏడాది జూన్ వరకు తను పదవిలో కొనసాగనున్నాడు. అగార్కర్ నేతృత్వంలో ఎంపిక చేసిన టీమిండియా.. 2023 అక్టోబర్ నుంచి 2026 మార్చి మధ్య కాలంలో 3 ఐసీసీ ట్రోఫీలు నెగ్గి, మరో టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని పొడిగింపు ఉంటుందని ముందుగానే అంచనా వేశారు.

