హర్మన్‌‌‌‌‌‌‌‌ వివరణ కోరనున్న బీసీసీఐ

హర్మన్‌‌‌‌‌‌‌‌ వివరణ కోరనున్న బీసీసీఐ

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో మూడో వన్డే సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ నుంచి బీసీసీఐ వివరణ కోరనుంది. ఈ మేరకు బోర్డు ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ రోజర్‌‌‌‌‌‌‌‌ బిన్నీ, ఎన్‌‌‌‌‌‌‌‌సీఏ చీఫ్‌‌‌‌‌‌‌‌ వీవీఎస్‌‌‌‌‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌తో ఆమె సమావేశం కానుంది. ఐసీసీ విధించిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌పై అప్పీల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై కూడా ఈ ముగ్గురు చర్చించనున్నారు. 

ప్రస్తుతానికైతే అప్పీల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని వార్తలు వస్తున్నాయి. దీనిపై బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరితే హర్మన్‌‌‌‌‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగే చాన్స్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తున్నది. జూన్‌‌‌‌‌‌‌‌ 1 వరకు ఉన్న ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఇండియా, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌కు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఆడే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. దీంతో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల నిషేధం ఎదుర్కొంటున్న హర్మన్‌‌‌‌‌‌‌‌కు క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌, సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఆడే అవకాశం లేదు. 

ఇక ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటున్న క్రికెట్‌‌‌‌‌‌‌‌ జట్లకు బస ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతున్నది. గేమ్స్‌‌‌‌‌‌‌‌ విలేజ్‌‌‌‌‌‌‌‌లో ఉంచాలా? ఫైవ్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌లో వసతి కల్పించాలన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.