
టీమిండియా ప్లేయర్స్ ఫిట్‌గా ఉండడానికి నెస్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కొత్త ఫిట్‌నెస్ అసెస్‌మెంట్‌ను ప్రవేశపెట్టింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థాయి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొత్తగా బ్రోంకో టెస్ట్‌ను ప్రవేశపెట్టారు. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా ప్లేయర్స్.. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ ఫిట్ గా ఉండడంలో విఫలమయ్యారు. ఒక్క సిరాజ్ తప్పితే మిగిలిన పేసర్లు అందరూ గాయపడ్డారు. ఫాస్ట్ బౌలర్లు ఫిట్ నెస్ విషయంలో సంతృప్తిగా లేకపోవడంతో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ రూల్ తీసుకొచ్చింది.
టీమిండియా ఆటగాళ్లు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ఫిట్‌నెస్ స్థాయిలను పెంచడం, వారి ఏరోబిక్ సామర్థ్యాన్ని బెటర్ చేయడం ఈ కొత్త టెస్ట్ లక్ష్యం. కొత్త ఫిట్‌నెస్ అంచనాను ప్రవేశపెట్టాలనే ఆలోచనను కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రౌక్స్ ప్రతిపాదించాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా దీనికి అంగీకరించారు. ఎస్ అండ్ సి కోచ్ ఆటగాళ్ళు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు జిమ్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా ఎక్కువ మైళ్లు పరిగెత్తాలని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కొంతమంది ఆటగాళ్ళు ఇప్పటికే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ లో బ్రోంకో టెస్ట్‌ను చేపట్టినట్టు తెలుస్తోంది.
బ్రోంకో టెస్ట్ అంటే ఏమిటి?
బ్రోంకో టెస్ట్‌లో 20 మీటర్ల షటిల్ తో పరుగు స్టార్ట్ చేస్తాడు. తరువాత 40 మీటర్లు.. 60 మీటర్ల పరుగు ఉంటుంది. ఇదంతా కలిపి ఒక సెట్ లో భాగం. ఒక ఆటగాడు అలాంటి ఐదు సెట్‌లు చేయవలసి ఉంటుంది. అంటే విరామం తీసుకోకుండా 1,200 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. టీమిండియా ప్లేయర్స్ ఈ బ్రోంకో టెస్ట్‌ను ఆరు నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్రోంకో టెస్ట్‌తో పాటు యో-యో టెస్ట్ కూడా ఉంటుంది. ఈ టెస్టులో 2 కిలోమీటర్ల టైమ్ ట్రయల్‌లో ఫాస్ట్ బౌలర్లు 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాటర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లు 8 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి.