హైదరాబాద్: బీసీలకు చాలా అన్యాయం జరిగిందని, వారిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటున్నారని ఓసీ జాతీయాధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. రాజకీయ రిజర్వేషన్లు ఓసీలకు లేవని, ఓసీలు 13 శాతమే గెలిచారని చెప్పారు. రాష్ట్రంలో అగ్రకుల జనాభా 21.5 శాతం ఉందన్నారు. ఓసీ జనాభా ఎక్కువ ఉన్న చోట ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిందని, దీంతో అగ్రకులాలకు కూడా చాలా అన్యాయం జరిగిందన్నారు. 75 ఏండ్లుగా బీసీల కులగణన లేకపోవడం దారుణమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఎప్పుడైనా బీసీల కోణం రాగానే మోసం చేస్తున్నాయన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు.
