ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లో రోజూ పోస్టులు పెడుతుంటాం. కొందరు అదే పనిగా పోస్టులు పెట్టి కామెంట్లు, లైకులు కోసం ఎదురు చూస్తుంటారు. సొంత ఫొటో పోస్ట్ చేసి.. లైకులు, కామెంట్ల టార్గెట్ పెట్టుకుంటారు. వాటికి వచ్చే స్పందన చూసి మురిసి పోతారు. అయితే, రోజూ చేసే పోస్టు ల్లో వచ్చే కామెంట్లలో ముఖ్యంగా పొగడ్తలు యూత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసా?
సోషల్ మీడియాలో పోస్టు చేసిన వాళ్ల ఫొటోకి వెటకారంగా స్పందిస్తే బాధపడతారని.. పొగడటం చాలా మందికి అలవాటు. ఫ్రెండ్, బంధువు, ఆత్మీయుడు.. ఎవరి పోస్టుల్లో అయినా పొగడ్తలు సాధారణం. అమ్మాయిల పోస్టులకు అయితే అబ్బాయిల పొగడ్తల గురించి చెప్పనక్కర్లేదు. అయితే, ఇలాంటి పొగడ్తలు మానసికంగా ప్రమాదం కల్గిస్తాయని 'స్కూల్ ఆఫ్ సైకాలజీ సైన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా యూనివర్శిటీ' సర్వేలో తేలిందట. ఆ యూనివర్శిటీ ప్రొఫెసర్ నిక్ హస్లాం చెప్పిందేంటంటే.. ‘సాధారణంగా పొగడ్తలు మనిషి మానిసిక పరిస్థితిని మెరు గుపరుస్తాయి. చేస్తున్న పని మీద ఆసక్తిని, పట్టుదలను పెంచుతాయి'.
అయితే సోషల్ మీడియాలో పొగడ్తల గురించి ఆ యూనివ ర్శిటీ చేసిన సర్వే ప్రకారం.. అతి పొగడ్తల వల్ల తెలియకుండా అవతలి వ్యక్తి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందట. ఒకరు ఫొటో పోస్టు చేస్తే.. అది ఎలా ఉన్నా మీరు అందంగా ఉన్నారని పొగిడితే అది మానసికంగా ప్రభావం చూపుతుందట. మీ పొగడ్తను గుర్తు చేసుకొని మరింత అందంగా తయా రవడానికి అవతలి వ్యక్తి ప్రయత్నిస్తాడట. తర్వాత పోస్ట్ చేసే ఫొటో మరింత అందంగా ఉంటే ఇంకా పొగడ్తలను ఆశిస్తారట. అను కున్న పొగడ్తలు రాకపోతే కుంగి పోతారట. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లు ప్రశాంతతకు దూరమయ్యే ప్రమాదం ఉందని హస్లాం తన సర్వే ద్వారా తెలిపాడు.