సైబర్​ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : తరుణ్ జోషి

సైబర్​ నేరాలపై  అప్రమత్తంగా ఉండాలి : తరుణ్ జోషి

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: సైబర్​నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాచకొండ కమిషనర్ తరుణ్​జోషి సూచించారు. సైబర్ నేరాల దర్యాప్తు, కేసు నమోదు, సెక్షన్లు, విచారణ పద్ధతులపై సోమవారం నేరేడ్ మెట్ లోని ఆఫీసులో సీపీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎస్ఓ, ఆయా స్టేషన్ల సైబర్ నేరాల దర్యాఫ్తు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సీపీ మాట్లాడుతూ.. యూరప్ దేశాల పోలీస్​వ్యవస్థ కంటే మన దేశ పోలీస్​వ్యవస్థ సమర్థంగా ఉందని చెప్పారు. ఆయా దేశాల మధ్య జరిగే యుద్ధాలు సైబర్ దాడుల ద్వారానే జరుగుతున్నాయన్నారు. సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పోషిస్తున్న పాత్రను గుర్తుచేశారు.