IPL Retention 2026: పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్ట్ ఇదే.. ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు గుడ్ బై

IPL Retention 2026: పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్ట్ ఇదే.. ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు గుడ్ బై

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా ఆటగాళ్లను టార్గెట్ చేసింది. ఏకంగా ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లను ఆ ఫ్రాంచైజీ వదిలేసుకుంది. స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ తో పాటు ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ లను రిలీజ్ చేసింది.  మ్యాక్స్ వెల్, హార్డీని వదిలేసినా గత సీజన్ లో అద్భుతంగా రాణించిన ఇంగ్లిస్ ను రిలీజ్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో పంజాబ్ మ్యాక్స్ వెల్ నమ్మి రూ. 4.2 కోట్లకు తీసుకుంటే తొలి మ్యాచ్ లోనే డకౌటయ్యాడు. గత సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా పూర్తిగా నిరాశపరిచాడు. 

స్టార్ ఆటగాడిగా ప్రతి మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో చోటు కల్పించినా తీవ్రంగా నిరాశకు గురి చేస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 2024 ఐపీఎల్ సీజన్ లో ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడకపోగా.. 2025 లో అదే చెత్త ఫామ్ కొనసాగించాడు. దీంతో 2025 ఐపీఎల్ సీజన్ లో అతన్ని రిలీజ్ చేయక తప్పలేదు. ఆరోన్ హార్డీ విషయానికి వస్తే.. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ కు ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం రాలేదు. దీంతో అతని అవసరం లేదని భావించిన జట్టు రిలీజ్ చేసింది. ఇంగ్లిస్ బాగా ఆడినప్పటికీ ఎందుకు రిలీజ్ చేసిందో తెలియాల్సి ఉంది. ఐపీఎల్ మెగా ఆక్షన్ లో పంజాబ్ ఈ ఆసీస్ వికెట్ కీపర్ ను రూ. 2.60 కోట్ల ధరకు దక్కించుకుంది.

ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ కు పంజాబ్ గుడ్ బై చెప్పింది. స్పిన్నర్ ప్రవీణ్ దూబేను కూడా రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడి రన్నరప్ గా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ తిరుగులేని ఆట ఆడినా తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓడింది.       

రిటైన్ చేసిన ఆటగాళ్లు:

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, పైలా అవినాష్, హర్నూర్ పన్ను, ముషీర్ ఖాన్, విష్ణు వినోద్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యంష్ షెడ్జ్, మిచెల్ సింగ్, విజయ్, మిచెల్ సింగ్, విజయ్, విజ‌య్‌కుమార్, బార్ట్లెట్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్

రిలీజ్ చేసిన ఆటగాళ్లు:

గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే