బ్యాక్ టు బ్యాక్ సినిమాలే కాదు.. వరుస విజయాలు కూడా సొంతం చేసుకుంటున్నాడు హీరో దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకున్నారు. తన విజయపరంపరను కొనసాగిస్తూ దుల్కర్ మరో విభిన్నమైన కథతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అదే ‘కాంత’ (KAANTHA). నిన్న శుక్రవారం (2025 నవంబర్ 14న) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన కాంత.. పాజిటివ్ టాక్తో దూసుకేళ్తోంది.
ఈ సందర్భంగా ‘కాంత’ ఫస్ట్ డే వసూళ్లను మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘కాంత’ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా రూ.10.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు వెల్లడించారు. ఇకపోతే ఇండియా వైడ్గా రూ.4.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందులో తమిళంలో రూ.2.65 కోట్లు రాగా, తెలుగులో రూ.1.7కోట్లు వచ్చినట్లు తెలిపాయి.
A SENSATIONAL START ❤🔥
— Wayfarer Films (@DQsWayfarerFilm) November 15, 2025
KAANTHA sparks electrifying collections on DAY 1 🔥
In cinemas now. Book your tickets! 🎟https://t.co/PMoP2b2FRD
A @SpiritMediaIN and @DQsWayfarerFilm production 🎬#Kaantha #Kaanthafilm #Kaanthafilmfrom14th@dulQuer @RanaDaggubati… pic.twitter.com/HhbddOlVHr
తొలిరోజు వసూళ్లు గమనిస్తే.. డీసెంట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే, 'కాంత' ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు. పీరియాడికల్ డ్రామా కావడంతో ఆడియన్స్ కనెక్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో.. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు వచ్చే టాక్ని బట్టి కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, మలయాళంలో కాంత రిలీజ్ కాకపోవడం గమనార్హం. లేదంటే, వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉండేది.
దర్శకుడు సెల్వరాజ్ సెల్వమణి తెరకెక్కించిన ఈ సినిమా.. 1950ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ చుట్టూ తిరుగుతుంది. ఆనాడు జరిగిన కొన్ని ఉత్కంఠభరిత సంఘటనల ఆధారంగా ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించాడు. పాత మద్రాస్ సినీ గ్లామర్‌తో పాటు, తెరవెనుక జరిగిన రాజకీయాలు, వివాదాలను కళ్లకు కట్టేలా ఉంది. ‘ఊదిపడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని..’ అంటూ దుల్కర్ చెప్పే డైలాగులు ఆసక్తిరేపుతున్నాయి.
ఒక ఎదుగుతున్న నటుడుకి, అతని స్టార్టింగ్ కెరీర్‌ను తీర్చిదిద్దిన గురువుకి మధ్య జరిగే పోరాటమే కాంతా. గురువుపై శిష్యుడు విధేయతకు బదులుగా, యుద్ధం చేయాల్సి రావడానికి గల కారణాలు ఏంటనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. గురువు పాత్రలో సముద్రఖని, శిష్యుడిగా దుల్కర్ మధ్య సాగిన పోరాటం సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి.
కథేంటంటే:
1950 నేపథ్యంలో స్టార్ హీరోకి, గొప్ప దర్శకుడికి మధ్య జరిగే కథ ఇది. అయ్య (సముద్రఖని) పేరున్న దర్శకుడు. తన తల్లి శాంత కథను అదే పేరుతో సినిమాగా తీయడం ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఒకప్పటి ఆయన ప్రియ శిష్యుడైన టీకే మహదేవన్ (దుల్కర్) ఇందులో హీరో. జీరోగా ఉన్న అతన్ని స్టార్ హీరోని చేసింది అయ్యనే. కానీ వీళ్లిద్దరి మధ్య ఇగో క్లాషెస్. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఓ ప్రొడ్యూసర్ చొరవతో తిరిగి ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది. కానీ హీరో మహదేవన్ సెట్‌లో దర్శకుడిని డామినేట్ చేస్తుంటాడు. ‘శాంత’ టైటిల్‌ను ‘కాంత’గా మార్చడంతో పాటు క్లైమాక్స్ కూడా తన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చాలని పట్టుబడుతుంటాడు.
ఇందులో కొత్త అమ్మాయి కుమారి (భాగ్యశ్రీ బోర్సే)ను హీరోయిన్‌గా తీసుకుంటారు. ఈమె అయ్య శిష్యురాలు కావడంతో సెట్‌లో ఆయన చెప్పిందే ఫాలో అవుతుంటుంది. మహదేవన్‌కు ఆమె వ్యవహారశైలి నచ్చకపోయినప్పటికీ తన అందం, టాలెంట్‌కు ఫిదా అవుతాడు. క్రమంగా ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ అప్పటికే ఓ మీడియా మొఘల్ కూతురితో అతనికి పెళ్లయింది.
మరోవైపు మహదేవన్, అయ్య మధ్య సయోధ్య కుదర్చడానికి కుమారి ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ అవేవి వర్కవుట్ అవవు. ఈ ఇద్దరి ఇగో క్లాషెస్‌తో మిగతా యూనిట్ అంతా ఇబ్బందులు పడుతుంటారు. ఎలాగోలా షూటింగ్ చివరి దశకు చేరుకుంటుంది. కానీ చివరి రోజు సెట్‌లో జరిగిన పరిణామాలతో ఒకే సీన్ మిగిలి ఉండగా షూటింగ్ ఆగిపోతుంది.
మరోవైపు అదేరోజు రాత్రి స్టూడియోలో ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య కేసును ఛేదించడానికి ఫీనిక్స్ (రానా) రంగంలోకి దిగుతాడు. స్టూడియో మొత్తం తన ఆధీనంలోకి తీసుకుని విచారణ మొదలుపెడతాడు. ఇంతకూ ఆ హత్య చేసిందెవరు..? వీళ్లిద్దరి ఇగో ఇష్యూస్‌కి కారణమేంటి..? ఇద్దరిలో ఎవరు చెప్పిన క్లైమాక్స్‌తో సినిమా పూర్తయింది.. అనేది మిగతా కథ.
