
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్), కోట్‌ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు: ఆఫ్‌లైన్ దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికేట్స్ జిరాక్స్‌ను ది మేనేజర్ (హెచ్‌ఆర్ &ఎ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్), కోట్‌ద్వారా యూనిట్, పావ్‌రి గర్‌వాల్, ఉత్తరాఖండ్ చిరునామాకు పోస్టు ద్వారా డిసెంబర్ 15వ తేదీ లోపు పంపాలి. వివరాలకు www.bel-india.in వెబ్సైట్ చూసుకోవాలి.