క్రికెట్ లో ఆల్ రౌండర్లు జట్టు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ రౌండర్ జట్టులో ఉంటే జట్టు బ్యాలన్స్ గా ఉంటుంది. లోయర్ ఆర్డర్ లో పరుగులు చేయడంతో పాటు ఐదో బౌలర్ గా జట్టులో ఉంటాడు. ప్రతి జట్టుకు ఆల్ రౌండర్లు అరుదుగా దొరుకుతారు. ఒక ప్లేయర్ ఆల్ రౌండర్ గా ఎదిగితే అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా జట్టులో మాత్రం ఆల్ రౌండర్ అనే పదాన్ని మించిపోయిన ఒక క్రికెటర్ ఉన్నాడు. బ్యూ వెబ్‌స్టర్ యాషెస్ లో తన విన్యాసాలతో షాకింగ్ కు గురి చేశాడు.
ఇంతకీ ఈ ఆసీస్ ఆల్ రౌండర్ అందరికంటే డిఫరెంట్ గా ఏం చేసాడో ఇప్పుడు చూద్దాం..
ఫాస్ట్ బౌలింగ్, స్పిన్నర్, బ్యాటర్:
క్రికెట్ లో అసలు సిసలు త్రీడీ ప్లేయర్ కు వెబ్‌స్టర్ నిర్వచనంలా మారాడు. ఆల్ రౌండర్ గా ఇంగ్లాండ్ తో జరిగిన చివరిదైన యాషెస్ లో ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 71 పరుగులు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలింగ్ లో రాణించి రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పై మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అసలు విషయం ఏంటంటే వీటిలో ఒక వికెట్ పేస్ వేసి తీశాడు. ఆరో రెండు వికెట్లు తన స్పిన్ మాయాజాలంతో పడగొట్టాడు. ఫాస్ట్ బౌలింగ్ వేసే వెబ్ స్టర్ సిడ్నీ పిచ్ స్పిన్ కు అనుకూలించడంతో స్పిన్ అవతరమెత్తి స్టోక్స్, విల్ జాక్స్ ను ఔట్ చేశాడు. దీంతో ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను 3D ప్లేయర్ గా చెప్పుకొస్తున్నారు.
ALSO READ : గోల్డెన్ ఛాన్స్ ఎవరికి: వరల్డ్ కప్‌కు తిలక్ డౌట్..
ఈ మ్యాచ్ విషయానికి వస్తే గురువారం (జనవరి 8) ఇంగ్లాండ్ తో ముగిసిన ఐదో టెస్టులో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి 4-1 తేడాతో యాషెస్ ను తమ ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లకు కోల్పోయి ఆస్ట్రేలియా అలవోకగా ఛేజ్ చేసింది. తొలి మూడు టెస్టులో ఆస్ట్రేలియా గెలిస్తే.. నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలిచింది. తాజాగా ముగిసిన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచి 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిన హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. సిరీస్ మొత్తం బౌలింగ్ తో చెలరేగిన స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
ALSO READ : ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్..
తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 384 పరుగులకు ఆలౌటైంది. రూట్ 160 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హ్యారీ బ్రూక్ (84), జెమీ స్మిత్ (46), విల్ జాక్స్ (27) కూడా రాణించగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (0), బ్రైడన్ కార్స్ (1) ఫెయిలయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మైకేల్ నెసర్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 567 రన్స్‌కు ఆలౌటైంది. స్మిత్ (138), వెబ్‌స్టర్ (71 నాటౌట్) రాణించారు. కార్స్, టంగ్ చెరో మూడు, స్టోక్స్ రెండు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ బెతేల్ సెంచరీతో ఇంగ్లాండ్ 342 పరుగులకు ఆలౌటైంది. 160 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.
Wickets of Harry Brook and Will Jacks in one over and then Ben Stokes 😲
— Cricbuzz (@cricbuzz) January 7, 2026
Beau Webster 🔥🔥 #Ashes pic.twitter.com/Ef1gU2rRMa
