V6 News

గోల్‌‌‌‌కీపర్లకు 644 బీర్లు పంపిన బీర్ కంపెనీ

గోల్‌‌‌‌కీపర్లకు 644 బీర్లు పంపిన బీర్ కంపెనీ
మెస్సీ వరల్డ్‌‌‌‌ రికార్డుకు వెరైటీ సెలబ్రేషన్ న్యూఢిల్లీ: 20 ఏళ్లు.. సింగిల్‌‌‌‌ క్లబ్‌‌‌‌.. 644 గోల్స్‌‌‌‌.. అర్జెంటీనా, బార్సిలోనా సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ లియోనల్‌‌‌‌ మెస్సీ.. సాకర్‌‌‌‌లో నెలకొల్పిన వరల్డ్‌‌‌‌ రికార్డు ఇది. సాంటోస్‌‌‌‌ క్లబ్‌‌‌‌ తరఫున లెజెండ్‌‌‌‌ పీలే (643) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొడుతూ… సృష్టించిన ఈ ఫీట్‌‌‌‌ను అమెరికా బీర్‌‌‌‌ కంపెనీ వినూత్నంగా సెలబ్రేట్‌‌‌‌ చేసింది. ప్రత్యేకంగా తయారు చేసిన 644 బీర్లను.. మెస్సీకి అపోజిషన్‌‌‌‌గా ఆడిన 160 మంది గోల్‌‌‌‌ కీపర్లకు పంపించింది. ప్రతి బాటిల్‌‌‌‌పై మెస్సీ ఫొటోతో పాటు కొట్టిన గోల్‌‌‌‌ సంఖ్యను ముద్రించింది. వాలేన్సియా గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ డియాగో అల్విస్‌‌‌‌కు అత్యధికంగా 19 బాటిల్స్‌‌‌‌ పంపించింది. రియల్‌‌‌‌ మాడ్రిడ్‌‌‌‌ గోల్‌‌‌‌ ఐకర్‌‌‌‌ కాసిలాస్‌‌‌‌ 17 బాటిల్స్‌‌‌‌తో సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ దక్కించుకున్నాడు. 2005లో ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ కెరీర్‌‌‌‌ మొదలుపెట్టిన మెస్సీ.. బార్సిలోనాను స్ట్రాంగ్‌‌‌‌ టీమ్‌‌‌‌గా నిలబెట్టాడు. యూరోపియన్‌‌‌‌ లీగ్‌‌‌‌లో తిరుగులేని ప్లేయర్‌‌‌‌గా స్టార్‌‌‌‌డమ్‌‌‌‌ సాధించాడు.