యూత్‌‌కు నచ్చేలా బిఫోర్ మ్యారేజ్

యూత్‌‌కు నచ్చేలా బిఫోర్ మ్యారేజ్

నవీన రెడ్డి ఫిమేల్ లీడ్‌‌గా  శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వంలో ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మించిన  చిత్రం ‘బిఫోర్ మ్యారేజ్’. జనవరి 26న సినిమా విడుదల కానుంది. ఎస్.కె.యమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఆదినారాయణ ఈ చిత్రాన్ని సుమారు 100 థియేటర్‌‌‌‌లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. నిర్మాతలు ప్రసన్నకుమార్, రామ సత్యనారాయణ అతిథులుగా హాజరై విజయం సాధించాలని కోరారు. 

నవీన రెడ్డి మాట్లాడుతూ ‘ఒక సాధారణ అమ్మాయి లైఫ్‌‌లో జరిగే పరిస్థితులే ఈ సినిమా. ఈ జనరేషన్‌‌కు బాగా కనెక్ట్ అవుతుంది’ అని చెప్పింది. మంచి యూత్‌‌ఫుల్ మూవీ అని చెప్పారు నటులు భరత్, అపూర్వ. ‘పెళ్లికి ముందు త‌‌ప్పు అనిపించ‌‌ని పొర‌‌పాటు కారణంగా.. లైఫ్‌‌లో ఒక్కసారిగా ఊహించ‌‌ని మార్పులు చోటు చేసుకుంటాయని, అదే విష‌‌యాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించాం’ అని అన్నాడు దర్శకుడు శ్రీధర్. యూత్‌కు మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అని నిర్మాత చెప్పారు.