హరీష్ రావు సీఎం పదవి కోసం రూ.5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారు : జగ్గారెడ్డి

హరీష్ రావు సీఎం పదవి కోసం రూ.5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారు : జగ్గారెడ్డి

బీఆర్ఎస్ నేత హరీష్ రావు పై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు హరీష్ రావు సీఎం పదవి కోసం రూ.5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారని ఆరోపించారు. డబ్బు ఎక్కడ దాచిపెట్టారో వెలికి తీయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా అని చెప్పారు. హరీష్ రావు, కేటీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్టులని అని విమర్శించారు. బాల్క సుమన్‌కి తెలివి లేదని అన్నారు. మరోసారి సుమన్ మాట్లాడితే డైరెక్ట్‌గా వెళ్లి కొడతామని హెచ్చరించారు.

ALSO READ :- Rakul Preet Singh: కారు పక్కన పెట్టి..ఆటోలో రకుల్ చక్కర్లు

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదని జగ్గారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడిన అందరి భాగోతం బయట పెడుతామని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులు వేల కోట్లు దండుకొని దాచిపెట్టుకున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.