ఏం తెలివిరా నీది: అడుక్కునే స్టైల్ ను మార్చేసిన బిచ్చగాడు

ఏం తెలివిరా నీది:  అడుక్కునే స్టైల్ ను మార్చేసిన బిచ్చగాడు

కాలంతో పాటు బిచ్చగాళ్లు కూడా మారిపోతున్నారు. బిచ్చం అడిగే విధానాన్నే మార్చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్ చేయాలని చేతిలో క్యూఆర్ కోడ్ తో దర్శనమిస్తున్నారు. టెక్నాలజీని వాడేస్తూ డిజిటల్ బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.

సాధారణంగా ఒక బిచ్చగాడు వచ్చి దానం చేయమని అడిగితే.. కొందరు చిల్లర ఉంటే వేస్తారు. మరికొందరు తినేందుకు ఏదైనా ఉంటే ఇస్తారు. ఇంకొందరుచిల్లర లేదని తిప్పి పంపించేస్తుంటారు.  ఇది డిజిటల్ యుగం కాబట్టి నగదు లేదనే చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ బిచ్చగాడు తన దూరదృష్టిని ఉపయోగించి చేతిలో క్యూఆర్ కోడ్‌తో అడుక్కుంటున్నాడు.

ఏ ఆధారం లేని వారు పూట గడవడం కోసం యాచకులుగా మారుతారు. సొసైటీలో పట్టెడన్నం కోసం పోరాడే బిచ్చగాళ్లు ఎంతో మంది ఉన్నారు. నిత్యం జనావాసాల్లో, రోడ్లపై, దేవాలయాల ముంగిట, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో ఈ యాచకులు ఎక్కువగా కనిపిస్తుంటారు. చేతిలో పాత్ర పట్టుకొని, లేదా సంచిని పట్టుకుని ఎదురయ్యే వారందరినీ యాచిస్తుంటారు. కొంత మంది వ్యక్తులు తమకు తోచినంత చిల్లర ఇస్తుంటారు. మరికొంత మంది విసుక్కుంటూ పంపించేస్తారు. ఇంకొందరైతే చిల్లర లేదంటూ బిచ్చగాళ్లను పంపించేస్తారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ బిచ్చగాడి నుంచి తప్పించుకోవడం సాధ్యమయ్యేలా లేదు. ఏకంగా టెక్నాలజీని వాడుకుంటూ చేతిలో క్యూఆర్ కోడ్ తో భిక్షాటన చేస్తూ అడుక్కునే స్టైల్ నే మార్చేశాడు. ఈ ఘటన ముంబై లోకల్ ట్రైన్ లో చోటేచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నేటి ఆధునిక కాలంలో అందివచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్నారు. మానవ జీవితంలో డిజిటల్ యుగం తీసుకు వచ్చిన మార్పులు అంతా ఇంతా కాదు. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా కూడా ఆన్ లైన్ పేమెంట్ లతో తమకు కావాల్సినవి సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో భిక్షాటన చేసే బిచ్చగాళ్లు కూడా టెక్నాలజీని వాడేస్తున్నారు. చిల్లర లేదని చెప్పే వాళ్లకు షాకిస్తూ ఆన్ లైన్ పేమెంట్ చేయమని క్యూఆర్ కోడ్ చూపిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ఎంతో కొంత ఆన్ లైన్ పేమెంట్ చేస్తున్నారు. ఇదే రీతిలో ముంబై లోకల్ ట్రైన్ లో ఓ బిచ్చగాడు క్యూఆర్ కోడ్ తో అడుక్కోవడం చూసి నోరెళ్లబెట్టారు ప్రయాణికులు. దీనిని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ గా మారింది. రద్దీగా ఉన్న బోగీలోకి పాటలు పాడుకుంటూ వచ్చిన బిచ్చగాడు క్యూఆర్ కోడ్ తో దర్శనమిచ్చాడు. దీంతో కొందరు ప్రయాణికులు ఆశ్చర్యపోగా, కొందరు నవ్వులు చిందించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ చిల్లర లేదని తప్పించుకునే వారు ఈ బిచ్చగాడి నుంచి తప్పించుకోలేరంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు

https://twitter.com/jaggirm/status/1672978792644759554