140 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు

140 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు

చైనా రాజధాని భీజింగ్ వరదలతో వణికిపోతుంది. 140 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత వర్షాలు అక్కడ కురవడంతో భారీ వరదలు ముంచెత్తాయి. మహానగరంలో కార్లన్నీ మునిగిపోయాయి. నిన్న ఒక్కరోజే 74 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని అక్కడి అధికారులు తెలిపారు. బీజింగ్ వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటి వరకు 30 మంది చనిపోయారు. మరో 50 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది.

 నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చాలా నదులపై వంతెనలు కొట్టుకుపోయాయి. బీజింగ్, షాంగ్ షాన్ జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నారు. బీజింగ్ పరిసరప్రాంతాల్లో ఉన్న 13 నదులు డేంజర్ లెవల్ లో ప్రవహిస్తున్నాయి. టియాంజిన్ ప్రాంతంలో నివసిస్తున్న 35 వేల మందిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.