ప్రకృతితో మమేకం కావడమే.. భారతీయ జీవన విధానం : కిషన్ రెడ్డి

ప్రకృతితో మమేకం కావడమే.. భారతీయ జీవన విధానం : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రకృతితో మమేకమై, పర్యావరణ పరిరక్షణలో భాగమవడం భారతీయ జీవన విధానమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న జీ–-20 మీటింగ్స్ లో సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులనుద్దేశించి మంగళవారం ఆయన ప్రసంLife Style,గించారు. యావత్​ భూమండలాన్ని తర్వాతి తరాలకు భద్రంగా అందించేందుకు ఇండియా కృతనిశ్చయంతో పనిచేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే ప్రధాని మోడీ ‘మిషన్ లైఫ్’ను ఆచరణలోకి తీసుకొచ్చారన్నారు. గిరిజనులు అడవుల్లో ప్రకృతితో సహజీవనం చేస్తూ.. అదే ప్రకృతిని తమ దైవంగా భావించడమే ‘మిషన్ లైఫ్’ ప్రోగ్రాంకు స్ఫూర్తి అని వివరించారు. ఈ దిశగా అన్ని దేశాలతో కలిసి పనిచేసేందుకు ఇండియా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మిషన్ లైఫ్ ను యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) స్వీకరించడం గర్వకారణమన్నారు.

ప్రకృతి సంరక్షణ, సంస్కృతి, సంప్రదాయాలు ఇండియాకు గొప్ప ఆస్తులని.. ప్రకృతిని ఆరాధిస్తూ దేశంలో ఎన్నో పండుగలు జరుగుతాయని వివరించారు. ఇండియా టూరిజం అభివృద్ధిలో ఇవన్నీ ప్రత్యేకమైన భూమిక పోషిస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రాలతో కలిసి పర్యాటక రంగాన్ని మరింత  ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 166 దేశాలకు ఈ–టూరిస్టు వీసాలు అందిస్తున్నామని, ఇమిగ్రేషన్ వ్యవస్థను మరింత సరళతరం చేశామని చెప్పారు. టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు త్వరలోనే గ్లోబల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ సమ్మిట్ ను నిర్వహించనున్నట్లు
కిషన్​రెడ్డి వెల్లడించారు.