బీటెక్, బీఎస్సీ అర్హతతో BELలో ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు

బీటెక్, బీఎస్సీ అర్హతతో BELలో ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలు..  జీతం రూ. 40 వేలు

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ , నవరత్న కంపెనీ అయిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్ –1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 07. 

  • పోస్టుల సంఖ్య: 610 
  • పోస్టులు: ట్రైనీ ఇంజినీర్ 1– టీఈబీజీ 488, ట్రైనీ ఇంజినీర్ 1 – టీఈఈఎం 122. 
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో నాలుగేండ్ల బి.టెక్/ బీఈ/ బీఎస్సీ ఇంజినీరింగ్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 
  • అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 24.  
  • లాస్ట్ డేట్: అక్టోబర్ 07. 
  • అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 177. 
  • సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్​లైన్ పద్ధతిలో నిర్వహించే రాత పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్ అంశాలపై 85 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
  • జీతం:  రూ.30 వేల నుంచి 40 వేలు  
  • పూర్తి వివరాలకు bel-india.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.