రష్యన్‌ విమానాలను అనుమతించని బెల్జియం

రష్యన్‌ విమానాలను అనుమతించని బెల్జియం

ఉక్రెయిన్‌పై దాడి క్రమంలో రష్యన్‌ విమానాలను తమ గగనతలంలోకి రాకుండా బెల్జియం నిషేధం విధించింది. బెల్జియం ప్రధాని అలెగ్జాండర్‌ డి క్రూ  దీనికి సంబంధించి  ట్విట్టర్‌లో ప్రకటన చేశారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకునే ఏ దేశానికైనా ఐరోపా సమాఖ్య గగనతలం అందుబాటులో ఉంటుందని, కానీ దుందుడుకు వైఖరితో వ్యవహరించేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. రష్యా విమానాల రాకపోకలను నిషేధిస్తూ ఇప్పటికే బల్గేరియా, చెక్‌ రిపబ్లిగ్‌, పోలండ్‌, రొమేనియా తదితర దేశాలు నిషేదం విధించాయి.

అయితే .. ఇప్పుడు రష్యా కూడా అదే తీరులో స్పందించింది. లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా, స్లొవేనియా విమానాలను తమ గగనతలంలోకి అనుమతించబోమని రష్యా ప్రకటించింది. కాగా ఉక్రెయిన్‌పై రసాయనిక ఆయుధాలను రష్యా ప్రయోగించే ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రి లిజ్‌ ట్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం..
ఈయూలో సభ్యత్వం ఇవ్వండి