కీవ్: యూరోపియన్ యూనియన్‌లో తమ దేశానికి సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ కోరారు. అది అసాధ్యమేమీకాదని అన్నారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రత్యేక విధానం ద్వారా ఉక్రెయిన్ను తక్షణమే చేర్చుకోవాలని ఈయూకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. తమ కోరిక న్యాయమైనదేనని అనుకుంటున్నానన్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ .. ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నానని అన్నారు.
