బెలారస్ వేదికగా రష్యా, ఉక్రెయిన్ నేతల భేటీ

బెలారస్ వేదికగా రష్యా, ఉక్రెయిన్ నేతల భేటీ

ఉక్రెయిన్ - రష్యా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఉక్రెనియన్  బెలారసియన్ సరిహద్దులోని గోమెల్ సిటీలో ఇరు దేశాల అధికారులు భేటీ జరుగుతోంది. రష్యాకు విదేశీ, రక్షణ వ్యవహారాలు, అధ్యక్ష కార్యాలయ అధికారులు, ఉక్రెయిన్ బృందంతో చర్చలు జరుపుతోంది. భేటీలో ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని రష్యా భావిస్తోంది. మరోవైపు కాల్పుల విరమణ, ఉక్రెయిన్ లో రష్యా సేనల ఉపసంహరణ ప్రధాన లక్ష్యంగా చర్చలు జరుగుతాయని ఉక్రెయిన్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో శాంతి చర్చల్లో ఎలాంటి నిర్ణయం రాబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

శాంతి చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా దాడులకు విరామం ప్రకటించింది. దీంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. ప్రజలపై దాడులు చేయమని ప్రకటించిన రష్యన్ ఆర్మీ స్థానికులు కీవ్ ను వదిలి వెళ్లొచ్చని సూచించింది. దీంతో వేలాదిగా జనం నగరం విడిచి వెళ్తున్నారు.

For more news..

కష్టపడ్డోళ్లకే కాంగ్రెస్‌లో కుర్చీ వేసి కూర్చోబెడ్తరు

ఇండియన్స్ తరలింపులో మరో కంపెనీ