ఇండియన్స్ తరలింపులో మరో కంపెనీ

ఇండియన్స్ తరలింపులో మరో కంపెనీ

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తరలించే స్పెషల్ ఆపరేషన్ లో భాగమయ్యేందుకు మరో ఎయిర్ లైన్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఇప్పటివరకు ఎయిరిండియా మాత్రమే స్పెషల్ ఫ్లైట్స్ లో ఇండియన్స్ ను తీసుకొస్తోంది. హంగేరి, రొమేనియా సరిహద్దులకు చేరుకున్న భారతీయులను ఇప్పటికే ఐదు ఫ్లైట్స్ లో 1,156 మందిని స్వదేశానికి చేర్చింది. ఇవాళ సాయంత్రం లోపు మరో 240 మందిని బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి తీసుకురానుంది. 

ఇప్పుడు భారతీయుల తరలింపు ఆపరేషన్ ను మరింత వేగవంతం చేసేందుకు ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్ రంగంలోకి దిగింది. వీలైనంత త్వరగా ఇండియన్స్ ను తీసుకొచ్చేందుకు స్పైస్ జెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా హంగేరిలోని బుడాపెస్ట్ కు ఇవాళ సాయంత్రం ఒక ఫ్లైట్ ను పంపనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. రేపు తెల్లవారు జామున 3.30 గంటలకు తొలి ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంటుందని స్పైట్ జెట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ తరలింపు ఆపరేషన్ కోసం మరిన్ని స్పెషల్ ఫ్లైట్స్ నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

మా వాళ్ల దగ్గరకు వెళ్తాం

ఉక్రెయిన్, రష్యా మధ్య ఐదు రోజులగా హోరా హోరీగా యుద్ధం జరుగుతోంది. జనావాసాలపై దాడులు చేయడంలేదని, కేవలం ఆర్మీ, స్ట్రాటజిక్ పాయింట్లనే టార్గెట్ చేస్తున్నామని రష్యా చెబుతున్నా.. పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ దేశంలో కొన్ని ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు, బిల్డింగ్స్ పై రష్యన్ బలగాలు క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఉక్రెయిన్ ప్రజల రక్షణపై ఆందోళన నెలకొంది. దీంతో ఇతర దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ పౌరులు తమ స్వస్థలాలకు వెళ్లి కష్ట సమయంలో తమ వారితో ఉండాలని భావిస్తున్నారు. ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీని ఆ దేశానికి చెందిన పౌరులు ఆశ్రయించారు. తమను ఉక్రెయిన్ తీసుకెళ్లాలని, లేదంటే కనీసం ఉక్రెయిన్ కు పొరుగున ఉన్న ఏదొక దేశం పంపాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేసిన అధికారులు

రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు

రష్యాలో భయం.. అందుకే దాడి తీవ్ర తగ్గించింది