కష్టపడ్డోళ్లకే కాంగ్రెస్‌లో కుర్చీ వేసి కూర్చోబెడ్తరు

కష్టపడ్డోళ్లకే కాంగ్రెస్‌లో కుర్చీ వేసి కూర్చోబెడ్తరు

కష్టపడ్డ వారికే కాంగ్రెస్ పార్టీలో పదవులన్నారు  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ లో పార్టీ సభ్యత్వాలపై సమావేశం జరిగింది.  దేశంలోనే  అత్యధికంగా 4 లక్షల 30వేలు పార్టీ సభ్యత్వాలు   నమోదు చేసిన నియోజకవర్గం నల్గొండ పార్టమెంట్ అని అన్నారు. అతి తక్కువగా 47 వేల పార్టీ సభ్యత్వాలు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నమోదయ్యాయన్నారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జిగా గీతారెడ్డే ఉన్నారన్నారు.  పార్టీ సభ్యత్వాల్లో పెద్దపల్లి పార్లమెంట్ సెకండ్ ప్లేస్ లో ఉందన్నారు.  34 లక్షల 69 వేల 53 సభ్యత్వాలు వెరిఫైడ్ అని 3 లక్షల 50వేలు అన్ వెరిఫైడ్  మెంబర్ షిప్ అని అన్నారు.  మొత్తం.. 38 లక్షల 19 వేల 53 సభ్యత్వాలు కాంగ్రెస్ పార్టీలో నమోదయ్యాయన్నారు.

సికింద్రాబాద్ లో జాతీయ స్థాయిలో నాయకులున్నారన్నారు. బూత్ లెవల్ లో 100 సభ్యత్వాలు చేయకుంటే  సికింద్రాబాద్ లో ఉన్న వారి పదవులన్నీ రద్దు చేయాలన్నారు.  కష్టపడ్డ వారికీ ప్రమోషన్ లు ఇస్తామన్నారు.   ఎంత పెద్ద నాయకుడైనా బూత్ లెవల్ లో 100 సభ్యత్వాలు చేయకపోతే పార్టీకి ఉపయోగపడరన్నారు. కేసీఆర్ బీహార్ కెళ్ళి ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నాడన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే.. పథకాలన్నీ  తమ కార్యకర్తలకే వస్తాయన్నారు . ఆంధ్రావాళ్లే తెలంగాణ లో పెత్తనం చేస్తున్నారని కేసీఆర్ రెచ్చగొట్టారన్నారు. నీళ్లు జగన్  తరలించుకెళ్తే.. నియామకాలు కేసీఆర్ ఇంటికి పోయాన్నారు రేవంత్.

మరిన్ని వార్తల కోసం..

ఇండియన్స్ తరలింపులో మరో కంపెనీ

రష్యాలో భయం.. అందుకే దాడి తీవ్ర తగ్గించింది