ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఫలించేనా?

ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఫలించేనా?

బేలారస్ వేదికగా రష్యా- ఉక్రెయిన్ చర్చలపై ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.  ఇవాళ  ప్రిప్యాట్ నదికి సమీపంలోని ఉక్రేనియన్ -బెలారసియన్ సరిహద్దు ప్రాంతంలో చర్చలు జరుగుతున్నాయి. చర్చలో భాగంగా ఉక్రేయిన్ ప్రతినిది బృదం- రష్యన్ ప్రతినిదుల బృదం సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడో ల్యాక్ ప్రకటించారు. భేటీకి ముందు  షరతులు లేకుండా చర్చలకు సిద్దంగా ఉన్నామని ఉక్రెయిన్ ప్రకటించగా...   షరతులకు లోబడి చర్చలకు రావాలని రష్యా ప్రకటించింది. యూరోపియిన్ యూనియన్ లో చేరవద్దని  రష్యా షరతు పెడుతుండగా.. యూరోపియన్ యూనియన్ లో చేర్చోకోవాలని ఉక్రెయిన్ కోరుతోంది. 

మరో వైపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండగా..రష్యా తన దాడులను కాస్త తగ్గించింది. చాలా చోట్ల ఉక్రెయిన్ పౌరులు రోడ్లపైకి వచ్చి రష్యా యుద్ధ ట్యాంకులను అడ్డుకుంటున్నారు. 4500 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు కూడా ఖండించాయి. రష్యాపై ఆర్థికంగా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో  ఇరు దేశాల మధ్య చర్చలు ఫలిస్తాయా అసలు ఏం జరగబోతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని వార్తల కోసం..

రష్యాతో యుద్ధానికి ఖైదీలను విడుదల చేస్తున్న ఉక్రెయిన్

పంజాబ్‌ కెప్టెన్‌ గా మయాంక్‌ అగర్వాల్