
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న మూవీ ‘కిష్కింధపురి’. హారర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కింది. ఈ మూవీని చావు కబురు చల్లగా మూవీతో దర్శకుడిగా పరిచయమైన కౌశిక్ డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 12న థియేటర్స్లో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 3న) ‘కిష్కింధపురి’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన.. అంటూ ‘కిష్కిందపురి ప్రేతాత్మ’ను పరిచయం చేసిన తీరు భయపెట్టించేలా ఉంది. దానికితోడు మసక చీకటి, ఓ ఒంటరి అడవి, అందులో వింతగా నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి.. ఇవన్నీ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.
‘కిష్కింధపురి’ కథ విషయానికి వస్తే:
దెయ్యాలపై ఆత్రుత ఉన్నవాళ్లందరినీ ఓ దెయ్యాల భవంతికి (సువర్ణ మాయ) తీసుకెళ్లి, దాని వెనకున్న కథేంటి అని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఓ వాకింగ్ చేయిస్తారు. ఈ ప్రయాణంలో అక్కడున్న వారందరూ తమకి దెయ్యం చూడాలంటూ ఆసక్తి కలిగిన వెంటనే..‘సువర్ణ మాయకు విచ్చేసినందుకు ధన్యవాదములు’ అనే డైలాగ్తో దెయ్యం ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ ఎంట్రీతో వారిలో భయం మొదలైంది. ఈ క్రమంలో వారు ఆ దెయ్యాల భవంతిలో ఎలాంటి అనుభవాలు ఫేస్ చేశారు? చివరకు ఏమైందనేది సినిమా కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది.
►ALSO READ | GHAATI Bookings: ‘ఘాటి’ బుకింగ్స్ ఓపెన్.. అనుష్క క్రైమ్ డ్రామా కథపై భారీ అంచనాలు!
ఇక ట్రైలర్ చివర్లో అనుపమ దెయ్యంగా మారడం, ఆ దెయ్యాన్ని ఎదుర్కొనే శక్తివంతుడైన పాత్రలో బెల్లకొండ కనిపించడం క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటికీ రిలీజైన టీజర్, అండ్ గ్లింప్స్ సైతం ప్రేతాత్మకే వణుకుపుట్టించేలా ఉన్నాయి.
ఇందులో భాగంగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు చైతన్య భరద్వాజ్ అందించిన మ్యూజిక్ ఇంటెన్స్ పెంచింది. ఓవరాల్గా ఈ సినిమాతో బెల్లకొండ, అనుపమ స్ట్రాంగ్ హిట్ కొట్టేలా స్క్రిప్ట్ను సెలెక్ట్ చేసుకున్నట్లు అర్ధమవుతుంది. ఇప్పటికే ఈ జంట ‘రాక్షసుడు’ వంటి క్రైమ్ థ్రిల్లర్లో నటించి మంచి హిట్ అందుకున్నారు. ఈ క్రమంలో ఇపుడు హార్రర్ మిస్టరీ థ్రిల్లర్తో వస్తూ అంచనాలు పెంచారు. ఈ ‘కిష్కింధపురి’ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.