GHAATI Bookings: ‘ఘాటి’ బుకింగ్స్ ఓపెన్.. అనుష్క క్రైమ్ డ్రామా కథపై భారీ అంచనాలు!

GHAATI Bookings: ‘ఘాటి’ బుకింగ్స్ ఓపెన్.. అనుష్క క్రైమ్ డ్రామా కథపై భారీ అంచనాలు!

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఘాటి’. క్రిష్‌‌‌‌‌‌‌‌ జాగర్లమూడి క్రైమ్ డ్రామాగా తెరకెక్కించాడు. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 3న) ‘ఘాటి’ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్.

ఇప్పటికే పలు రాష్ట్రాలలో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. తాజాగా నైజాంలో ఓపెన్ చేశారు. ‘ది క్వీన్ అనుష్క వెండితెరను సొంతం చేసుకోవడానికి తిరిగి వచ్చింది. ఘాటి నైజాం బుకింగ్స్ ఓపెన్.. మీ దగ్గరున్న థియేటర్లో స్వీటీ విశ్వరూపం చుసేయండీ’ అని మేకర్స్ పోస్ట్ పెట్టారు.

అనుష్క తన గత సినిమాల్లో ‘అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి..’ ఇలా ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ చేసి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ‘ఘాటి’లో సైతం ‘శీలావతి’ క్యారెక్టర్‌‌లో పవర్ ఫుల్ రోల్లో నటించింది. ఇప్పటికే, టీజర్, ట్రైలర్ విజువల్స్లో అనుష్కకి సంబంధించి సగం విశ్వరూపాన్ని చూసేశాం. ఇక రిలీజ్ అయ్యాక.. తన వీరోచిత పోరాటాన్ని, రోమాలు నిక్కపొడిచే పెర్ఫార్మన్స్ని చూడబోతున్నాం.

ఈ మాటలు వెనుక ఫస్ట్ టీజర్లో చూపించిన బస్సు షాట్ ఒక్కటి చాలు. ఒకడి తలని రప్పా రప్పా అని అనుష్క నరికే సీన్. ఇది చాలదా మిగతాది ఉహించుకోవడానికి! ఇకపోతే, ఇందులో దేశిరాజుగా విక్రమ్ ప్రభు, కుందుల నాయుడుగా చైతన్య రావు, జగపతిబాబు కీ రోల్స్లో కనిపిస్తున్నారు. 

►ALSO READ | వెంకీ మామకు జోడీగా.. కేజీఎఫ్ హీరోయిన్

ఇదిలా ఉంటే .. ‘ఘాటి’ సినిమాకు సెన్సార్ బోర్డు U/A స‌ర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంట‌ల 37 నిమిషాల రన్ టైంతో మూవీ రానుంది. అరకు, గాంజా మాఫియా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కథ రూపొందించినట్లు టాక్. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌ బ్యానర్‌‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. చింతకింద శ్రీనివాసరావు కథను అందించారు.

‘ఘాటి’ కథ:

అరకు, గాంజా మాఫియా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దర్శకుడు క్రిష్ సినిమాని తెరకెక్కించాడు. ఫ‌స్టాఫ్ మొత్తం ఎమోష‌న‌ల్ జ‌ర్నీతో మొదలై, ఇంటర్వెల్కి బిగ్ ట్విస్ట్ ఉండబోతుందట. అలాగే, సెకండాఫ్ ఊహించని రీతిలో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్‌గా ఉంటుందని సినీ వర్గాల సమాచారం. విక్రమ్‌ ప్రభు, చైతన్య రావు, జగపతిబాబు, రవీంద్రన్ విజయ్ పాత్రలు పవర్ ఫుల్గా ఉండనున్నాయట. ముఖ్యంగా అనుష్క శత్రువులను ఉచకోత కోస్తూ తన వీరత్వాన్ని ప్రదర్శించిందని టాక్.

ఓవరాల్గా ‘ఘాటి’.. 'ఫ‌స్టాఫ్ మొత్తం ఎమోష‌న‌ల్, సెకండాఫ్ యాక్షన్ మోడ్'.. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని సెన్సార్ రిపోర్ట్స్ సైతం చెబుతున్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్లో అనుష్క రౌద్రంగా, శక్తివంతంగా ఎలా ఉందో చూసేశాం. ఇపుడు అంతకుమించిన డ్రామా, యాక్షన్ పక్కా అనే టాక్ వస్తుండటంతో మూవీపై ఆసక్తి నెలకొంది.