
‘కేజీఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. నానికి జంటగా ‘హిట్ 3’లో నటించి టాలీవుడ్‌లోనూ సక్సెస్ అందుకుంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో ఆమె జాయిన్ కానుందని తెలుస్తోంది. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందనున్న చిత్రంలో శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే కథను వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. దీనిపై టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. వెంకటేష్ హీరోగా నటిస్తున్న 77వ సినిమా కాగా, వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరోవైపు శ్రీనిధి ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డకు జంటగా ‘తెలుసు కదా’ చిత్రంలో నటిస్తోంది. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 17న సినిమా విడుదల కానుంది. దీంతోపాటు పలు తమిళ, కన్నడ ప్రాజెక్టులు శ్రీనిధి లైనప్‌లో ఉన్నాయి.