సింగరేణి ఎగ్జిక్యూటివ్ ​క్రికెట్ టోర్నమెంట్ ​విజేత బెల్లంపల్లి రీజియన్

సింగరేణి ఎగ్జిక్యూటివ్ ​క్రికెట్ టోర్నమెంట్ ​విజేత బెల్లంపల్లి రీజియన్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి ఎగ్జిక్యూటివ్​ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా బెల్లంపల్లి రీజియన్​ నిలిచింది. కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్​లోని జయశంకర్​గ్రౌండ్​లో మూడు రోజులు నిర్వహించిన క్రికెట్​ఆఫ్​ సింగరేణి ఎగ్జిక్యూటివ్​టోర్నమెంట్​సోమవారం ముగిసింది. సింగరేణివ్యాప్తంగా కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి రీజియన్ల నుంచి ఎగ్జిక్యూటివ్ టీమ్స్ పాల్గొన్నాయి.

ఫైనల్లో కొత్తగూడెం, బెల్లంపల్లి జట్ల మధ్య పోరు సాగింది. బెల్లంపల్లి రీజియన్​ విజేతగా నిలిచింది. మహిళా ఎగ్జిక్యూటివ్​ పోటీల్లో కొత్తగూడెం ఏరియా విజేతగా, రన్నర్​గా బెల్లంపల్లి జట్టు నిలిచాయి.  విజేతలకు సింగరేణి డైరెక్టర్​డి. సత్యనారాయణ సోమవారం బహుమతులను అందజేశారు. జీఎం సీపీపీ మనోహర్​, కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి పాల్గొన్నారు.