నేను రెండు రాష్ట్రాల వాడ్ని.. జోక్యం చేసుకోను

నేను రెండు రాష్ట్రాల వాడ్ని.. జోక్యం చేసుకోను

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలకు సంబంధించి వివాదం నెలకొంది. ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న కృష్ణా జలాల కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఎన్‌వీ రమణ హాట్ కామెంట్లు చేశారు. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని జడ్జి రమణ సూచించారు. 

‘ఈ కేసులో నేను చట్టపరంగా జోక్యం చేసుకోబోను. నేను ఉభయ (రెండు తెలుగు) రాష్ట్రాలకు చెందిన వాడ్ని. ఒకవేళ ఈ వివాదం మధ్యవర్తిత్వం ద్వారా ఓ కొలిక్కి వస్తుందని భావిస్తే అలాగే పరిష్కరించుకోండి. దీనికి మేం సహకరిస్తాం లేదంటే ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తా’ అని విచారణ సందర్భంగా సీజేఐ రమణ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను రివర్ బోర్డు ఒప్పించి, వివాదాన్ని పరిష్కరించుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో అనవసరంగా తాము జోక్యం చేసుకోబోమన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణ బుధవారం జరగనుంది.