పాక్కు మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించిన బెన్ స్టోక్స్

పాక్కు మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించిన బెన్ స్టోక్స్

పాకిస్తాన్కు ఇంగ్లాండ్ క్రికెటర్ విరాళం ప్రకటించాడు. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్ కోసం పాక్ వెళ్లిన బెన్ స్టోక్స్..తన మ్యాచు ఫీజు మొత్తాన్ని పాక్కు విరాళం ఇస్తానని వెల్లడించాడు.  ఈ ఏడాది పాక్లో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. పలు నగరాలు దెబ్బతిన్నాయి. దీంతో పాక్ ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా మ్యాచ్ ఫీజును విరాళంగా అందిస్తున్నట్లు స్టోక్స్ ట్వీట్ చేశాడు. ఇక మూడు మ్యాచుల ద్వారా బెన్ స్టోక్స్ రూ. 37 లక్షలు అందుకోనున్నాడు. ప్రస్తుతం ఈ మొత్తాన్ని పాక్లో వరదల బాధిత ప్రాంతాల అభివృద్ధికి  ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. 

https://twitter.com/benstokes38/status/1597170046857465856
ప్రజల కోసం ఖర్చు చేస్తారని ఆశిస్తున్నా...

టెస్టు సిరీస్ లో ఆడేందుకు పాక్ రావడం ఆనందంగా ఉందని బెన్ స్టోక్స్ అన్నాడు. 17 ఏళ్ల తర్వాత పాక్ లో ఇంగ్లాండ్ టీమ్ అడుగుపెట్టడంతో..సిరీస్ లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. అయితే 2022 ప్రారంభంలో పాక్ లో వరదలు బీభత్సం సృష్టించాయని..వాటి కారణంగా పాక్ ప్రజల జీవనం చిన్నాభిన్నం అయిందన్నాడు. ఇది చూసి తన మనసు చలించిపోయిందని..అందుకే మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలనుకున్నట్లు తెలిపాడు. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా లభించే మొత్తాన్ని పాక్ వరద బాధిత సహాయ కేంద్రానికి అందిస్తానన్నాడు. ఈ డబ్బును వరదల్లో దెబ్బతిన్న నగరాల పునర్నిర్మాణం కోసం ఉపయోగిస్తారని ఆశిస్తున్నట్లు బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. 


2005 లో పాక్లో టెస్ట్ సిరీస్..

ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు పాక్ వెళ్లిన ఇంగ్లాండ్..17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడేందుకు అడుగుపెట్టింది. 2005లో పాకిస్తాన్లో టెస్ట్ సిరీస్ ఆడిన ఇంగ్లాండ్..ఆ తర్వాత అక్కడ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఇటీవలే పాక్లో ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ఆడింది. 7 మ్యాచుల టీ20 సిరీస్ను ఇంగ్లాండ్ 4-3తో గెలిచింది.