IND vs ENG 2025: క్రీడా స్ఫూర్తి మరిచిన ఇంగ్లాండ్.. సుందర్, జడేజా సెంచరీలు అడ్డుకునేందుకు ప్రయత్నం

IND vs ENG 2025: క్రీడా స్ఫూర్తి మరిచిన ఇంగ్లాండ్.. సుందర్, జడేజా సెంచరీలు అడ్డుకునేందుకు ప్రయత్నం

మాంచెస్టర్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసింది. నాలుగో రోజు తొలి సెషన్ తర్వాత ఇంగ్లాండ్ విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు. నాలుగో రోజు లంచ్ కు ముందు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయింది. సాయి సుదర్శన్, జైశ్వాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరారు. ఈ దశలో భారత జట్టు ఓటమి ఖాయమని దాదాపు  ప్రతి ఒక్కరు భావించారు. ఐదు సెషన్ లు.. 150 పైగా ఓవర్లు.. రిషబ్ పంత్ కు గాయం.. తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు.. ఈ మ్యాచ్ ఫలితం చివరకు డ్రా అవుతుందని ఎవరైనా అనుకుంటారా.. కానీ గిల్ సేన అద్భుతం చేసింది. 

నాలుగో రోజు ఓపెనర్ రాహుల్, కెప్టెన్ శుభమాన్ గిల్ పట్టుదలతో భారత జట్టు 2 వికెట్లకు 174 పరుగులతో నాలుగో రోజును ముగించింది. దీంతో డ్రా పై ఆశలు చిగురించాయి. ఐదో రోజు తొలి సెషన్ లో రాహుల్, గిల్ ఔట్ కావడంతో డ్రా పై ఆశలు వదిలేసుకున్నారు. అయితే చివరి రోజు చివరి రెండు సెషన్ లలో సుందర్, జడేజా అసమాన పోరాటంతో జట్టును నిలబెట్టారు. రెండు సెషన్ లో కూడా ఇంగ్లాండ్ బౌలర్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా స్పెషలిస్ట్ బ్యాటర్ల వలే ఆడారు. దీంతో ఒకదశలో డ్రా  కోసం పోరాడుడిన మన జట్టు.. ఇంగ్లాండ్ జట్టు వచ్చి డ్రా ఇస్తారా అనే అడిగే పరిస్థితికి తీసుకొచ్చారు. 

ఆట మరో 15 ఓవర్లు ఉండగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రా చేసుకోవాలని జడేజా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూశాడు. అయితే అప్పటికే సుందర్, జడేజా ఇద్దరూ కూడా సెంచరీలకు దగ్గరలో ఉండడంతో మన జట్టు డ్రా కు అంగీకరించలేదు. దీంతో కాసేపు గ్రౌండ్ లో హై డ్రామా చోటు చేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి గిల్ నవ్వుతూ కనిపించాడు. మొత్తానికి ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూసిన ఇంగ్లాండ్ కు మన జట్టు ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 358 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 669 పరుగుల భారీ స్కోర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రా కావడంతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం  ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్ట్ జూలై 31 న ఓవల్ లో జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులు వెనకబడిన మన జట్టు రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లను 425 పరుగుల వద్ద ఐదో రోజు ముగించింది.  

తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులు వెనకబడిన మన జట్టు రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లను 425 పరుగుల వద్ద ఐదో రోజు ముగించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 124 పరుగుల లీడ్ సాధించింది. ఐదో రోజు గిల్ తో పాటు జడేజా, సుందర్ సెంచరీల మోత మోగించడం విశేషం. ఐదు రోజుల ఆటలో ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ ను డ్రా అయింది.