దళిత బంధు యూనిట్లతో లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి

దళిత బంధు యూనిట్లతో లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి

ఆసిఫాబాద్ ,వెలుగు: జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, కాలువల నిర్మాణ పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని కుమ్రంభీం ఆసిఫాబాద్​ కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులును ఆదేశించారు. బుధవారం  కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ రాజేశం, డీఆర్వో సురేశ్​తో కలిసి ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్​మెంట్​అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగన్నాథపూర్​ప్రాజెక్టు, ఎన్​టీఆర్​సాగర్, పీఆర్పీడీ ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

దళితబంధుతో ఆర్థికంగా ఎదగాలి

దళిత బంధు యూనిట్లతో లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టాటియా గార్డెన్స్ లో దళితబంధు మొదటి విడత లబ్ధిదారుల ముఖాముఖీ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎమ్మెల్యేలు  కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు లతో కలిసి హాజరయ్యారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు లబ్ధిదారులు తాము ఎంచుకున్న యూనిట్లకు మంజూరైన నిధులను సద్వినియోగపరచుకొని ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలన్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు ద్వారా అర్హత కలిగిన ప్రతి దళిత కుటుంబం అభివృద్ధి చెందేలా రూ.10 లక్షలు అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, సీపీఓ రవీందర్ పాల్గొన్నారు.